అన్వేషించండి

RK Roja News: ఈ వరదలు సీఎం వైఫల్యమే, మంత్రులంతా ఏం చేస్తున్నారు? - తొలిసారి స్పందించిన రోజా

Vijayawada News: విజయవాడ వరదల గురించి స్పందిస్తూ మాజీ మంత్రి రోజా ఓ వీడియో విడుదల చేశారు. ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందని అన్నారు.

Telugu  News: విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందని, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదని.. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదని అన్నారు. ఎంతమంది వరదల్లో కొట్టుకువెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకుందని అన్నారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపల్యమే కారణం అని రోజా ఆరోపించారు. మంత్రులు విహార యాత్రలకు వెళ్లి.. ప్రజలను వరదల్లో ముంచేశారన.. ఇదేదో తాను విమర్శించడానికి చెప్తున్న మాట కాదని అన్నారు. మనం ఏ టీవీ చూసినా, టీడీపీ చానళ్లు చూసినా ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో తెలుస్తుందని రోజా అన్నారు.

జనాన్ని మూడు రోజుల పాటు ఎలా గాలికొదిలేశారో వాళ్ల మాటల్లోనే మనకు అర్థమవుతుంది. విజయవాడ మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం ఐదు రోజులైనా కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణం. వరద సహాయ చర్యల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు ఇంటికి 3 కిలో మీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేకపోయారంటే.. ఇది ముమ్మాటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం. కనీసం గంట ముందు అప్రమత్తం చేసినా...విజయవాడ నగరంలోని ప్రజలు ముంపు బారిన పడేవారు కాదు.

నాలుగు రోజుల పాటు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా కష్టాలు పడ్డారంటే ఇంతకంటే ఘోరమైన వైఫల్యం మరొకటి ఉండదు. నాలుగు రోజుల పాటు సుమారు మూడు లక్షల మందిని ముంచేసి కనీసం నీళ్లు, పాలు కూడా అందించకపోవడం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రులకు వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు కానీ, ప్రజల కష్టాల కోసం ఆలోచించడం లేదు. ఈనెల 29, 30వ తేదీల్లో సీఎం నుండి మంత్రుల వరకు అందరూ వీకెండ్ విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్నారు.

28 వ తేదీనాడే వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయి అయినా సమాచారం ఇచ్చినా.. కనీసం సీఎం చంద్రబాబు కానీ హోంమంత్రి కానీ, పంచాయతీరాజ్ మంత్రి కానీ, రెవెన్యూ మంత్రికానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ...ఒక్కరంటే ఒక్కరు కూడా ఎలాంటి సమీక్ష కూడా చేయలేదు. ప్రభుత్వం భారీ వర్షాలపైనా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన 10 మంది ప్రాణాలు పోయాయి. వరదల కోసం కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన ఏకంగా మూడు లక్షల మంది విజయవాడ సెంట్రల్, వెస్ట్, మైలవరం, నందిగామ, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జనం వరదలో చిక్కుకుపోయారు.

మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు, వరదలు, తుఫాన్లు వస్తాయన్న సమాచారం ఉంటే.. ముందుగానే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే వాళ్లం. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఆహారం, పాలు, మంచినీళ్లు అందించేవాళ్లం. అంతేకాదు వరద, తుఫాన్ బాధితులకు వాళ్ల ఇళ్లకు కూడా ఆహారం, నిత్యవసరాలు పంపిణీ చేసేవాళ్లం.

జగనన్న నిరంతరం అధికారులతో సమీక్షలు జరిపి, ఆయన చుట్టూ అధికారులను తిప్పుకోకుండా ప్రజలకు ముందు సహాయ చర్యలు అందేలా చేసేవారు. ఈరోజు విజయవాడ వరదల్లో అలాంటి సహాయం ఎవ్వరికైనా ఇంటికి వెళ్లి అందించారా..? అధికారులను కనీసం సీఎం కానీ, మంత్రులు కానీ ముందుగా సిద్ధం చేశారా..?

ఈ మంత్రులు ఏం చేస్తున్నారు...

హోంమంత్రి, విపత్తుల నిర్వహణ మంత్రి కనీసం ఈ విపత్తుపైనా అధికారులను కానీ, ఇతర శాఖలను కానీ అప్రమత్తం చేసిందా..? ఒక్క సమీక్ష అయినా ముందుగా చేసిందా..? ఇక మంత్రి లోకేష్ ఏం చేశారు మంగళగిరిలో వర్షాలు కురిస్తే, విజయవాడలో వరద వస్తే వాళ్లను వదిలేసి హైదరాబాద్ కి వెళ్లిపోతారా..?

మున్సిపల్ శాఖమంత్రి నారాయణ ఏం చేశారు విజయవాడలో ప్రజలను ముంచేసింది మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదా..? మంత్రి నారాయణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండని కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ అయినా పెట్టారా...? ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రామాలు తెలుసు కానీ.. ఇప్పుడు ఇంత పెద్ద వరద వస్తుందని ఆ మంత్రికి తెలియదా..?జనాన్ని ముంచేస్తుందని తెలియదా..? ఇంత వరద వస్తే...కనీసం జనం కోసం బోట్లు కూడా సిద్ధం చేయలేదు

రెవెన్యూ మంత్రి నాలుగు రోజులు కనిపించలేదు.. జనం వరదల్లో ఉంటే రెవెన్యూ మంత్రి సత్య ప్రసాద్ ఎక్కడో విహార యాత్రలకు వెళ్లారు. రెవెన్యూ మంత్రి ఇంత వర్షాలు వస్తాయని తెలిసి కనీసం ఒక్క సమీక్ష అయినా చేశారా..? అసలు పునరావాస కేంద్రాలు లేవు...వరదలు, వర్షాలు వస్తే రెవెన్యూ శాఖనే కీలకం. అలాంటిది ఆ మంత్రి కనీసం పట్టించుకోలేదు

కేంద్రంలో చక్రం తిప్పుతాం అని చెప్పుకుంటారు. కనీసం నాలుగు రోజులుగా వరద ఉంటే ఆరు హెలికాఫ్టర్లకు మించి తెప్పించలేకపోయారు. విమానయాన మంత్రి కూడా ఈ టీడీపీ నేత రామ్మోహన్ నాయుడే ఉన్నారు కదా.. ఆయనేమో నాలుగు రోజులు కనీసం పట్టించుకోలేదు. పంచాయతీరాజ్ శాఖమంత్రి పవన్ కళ్యాణ్ ఐదు రోజులైనా ఇంకా విజయవాడ వెళ్లలేదు. కనీసం వరదలపై ఆయన శాఖ అధికారులతోను, సహాయ చర్యలపైనా సమీక్ష చేయలేదు. ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ జనాన్ని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా గాలికివదిలేశారు.

ఇప్పటికైనా గతంలో మా జగనన్న ప్రభుత్వంలో ఎలా సహాయ చర్యలు అందించామో తెలుసుకుని.. వాటిని అమలు చేయండి. దయచేసి ఈ ప్రభుత్వం ప్రజలను కాపాడండి. ముందు ఆహారం, నీళ్లు అందించండని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.’’ అని ఆర్కే రోజా స్పందించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
Visakhapatnam Steel Plant: చంద్రబాబు ఒక మాట చెబితే ప్రైవేటీకరణ ఆగుతుంది: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ
చంద్రబాబు ఒక మాట చెబితే ప్రైవేటీకరణ ఆగుతుంది: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ
Anchor Shyamala: 'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు
'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు
Anand Deverakonda: నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌
నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్టీఆర్‌ని స్టార్‌నీ దేవుడ్నీ చేసిన లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డిసిద్దరామయ్య ఈవెంట్‌లో భద్రతా లోపం, సీఎం వైపు దూసుకొచ్చిన యువకుడుబిగ్‌బీ కేబీసీ షోలో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్మోహన్ బాబు యూనివర్సిటీలో వివాదం, మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
Visakhapatnam Steel Plant: చంద్రబాబు ఒక మాట చెబితే ప్రైవేటీకరణ ఆగుతుంది: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ
చంద్రబాబు ఒక మాట చెబితే ప్రైవేటీకరణ ఆగుతుంది: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ
Anchor Shyamala: 'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు
'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు
Anand Deverakonda: నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌
నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌
Ganesh Laddu Auction: వేలంలో రికార్డ్ ధర పలికిన మై హోమ్ భుజా గణేషుడి లడ్డూ, ధర ఎంతంటే
వేలంలో రికార్డ్ ధర పలికిన మై హోమ్ భుజా గణేషుడి లడ్డూ, ధర ఎంతంటే
iPhone 16 Sale: ఐఫోన్ 16 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం - ఏకంగా రూ.67,500 వరకు ఆఫర్!
ఐఫోన్ 16 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం - ఏకంగా రూ.67,500 వరకు ఆఫర్!
Malavika Mohanan : మాళవిక మోహనన్ ఓనమ్ లుక్.. వైట్ శారీలో కాకుండా రెడ్ డ్రెస్​లో సెలబ్రేషన్స్
మాళవిక మోహనన్ ఓనమ్ లుక్.. వైట్ శారీలో కాకుండా రెడ్ డ్రెస్​లో సెలబ్రేషన్స్
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం - స్వాధీనం చేసుకున్న చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం - స్వాధీనం చేసుకున్న చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు
Embed widget