News
News
X

Guntur Stampede: గుంటూరు తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ 

Guntur Stampede: గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జడ్జి శేష సయనారెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.

FOLLOW US: 
Share:

Guntur Stampede: జనవరి ఒకటో తేదీన గుంటూరులో జరిగిన తొక్కిసలాటపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జడ్జి శేష సయనారెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. అయితే చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయిన స్థలాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీని అడిగి జ్యుడీషియల్ కమిషన్ వివరాలు సేకరించింది. క్షతగాత్రులు, మృతుల కుటుంబాల స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు. విచారణ అనంతరం రిటైర్డ్ జడ్ది నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇవ్వనుంది. 

ఏ1 నిందితుడిగా ఉయ్యూరు శ్రీనివాస రావు అరెస్ట్ 

గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితమే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్ నేతృత్వంలోని ఉయ్యూరు ఫౌండేషన్ గుంటూరు సదాశివ నగర్ లోని వికాస్ హాస్టల్ మైదానంలో జనవరి ఒకటో తేదీ ఆదివారం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరికొందరు ఆసుపత్రిలో చేరారు. ఇంకొదరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. 

కార్యక్రమానికి సరిపడా సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ.. ప్రమాదం

గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా... ఇందులో ప్రధాన నిందితుడిగా ఉయ్యూరు శ్రీనివాస్‌ను పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. క్యూలో జనాలను ఎక్కువ సమయం నిలబెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమానికి సరిపడా సెక్యూరిటీ ఇచ్చామని వివరణ ఇచ్చారు. ఫస్ట్‌ కౌంటర్ వద్దే ప్రమాదం జరిగిందని... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే హెచ్చరించినట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా తానా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న శ్రీనివాస్‌ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన గుంటూరు సహా మూడు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకలు పంపిణీకి యత్నించారు. మొదటగా గుంటూరు వెస్ట్‌లో చీరలు, సరకుల పంపిణీ చేపట్టారు.

ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రబాబు

ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబును చీఫ్‌ గెస్ట్‌గా పిలిచారు. స్థానిక నాయకులను కూడా ఆయన ఆహ్వానించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన కాసేపటికే చీరల పంపిణీలో అపశ్రుతి జరిగిపోయింది. అనుకున్నదాని కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలు రావడంతో నిర్వాహకులు అదుపు చేయలేకపోయారు. బారికేడ్ల పై నుంచి జనం తోసుకొని రావడంతో ఘోరం జరిగిపోయింది. ఘటన జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారికి పరిహారం కూడా ప్రభుత్వంతోపాటు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, చీరల పంపిణీ చేసిన ఉయ్యూరు శ్రీనివాస్‌ కూడా ప్రకటించారు. మృతి చెందిన వారికి కుటుంబానికి ఒక్కొక్కరికి 31 లక్షలు అందనుంది. ఇందులో తెలుగుదేశం ఐదు లక్షలు, ప్రభుత్వం తరఫున 2 లక్షలు అందించారు. ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున 20 లక్షలు సాయం ప్రకటించారు. ఇలా మొత్తంగా 31 లక్షల సాయం మృతుల కుటుంబాలకు అందింది.

Published at : 19 Jan 2023 02:32 PM (IST) Tags: AP News Chandra Babu News Guntur Stampede Guntur Stampede Incident Enquiry on Guntur Stampede

సంబంధిత కథనాలు

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్

గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్

Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్

Nagayalanka Ysrcp Clashes : వైసీపీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు, నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఫైట్

టాప్ స్టోరీస్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Weather Latest Update: నేడు వాయుగుండంగా అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన - ఈ ప్రాంతాల్లోనే

Weather Latest Update: నేడు వాయుగుండంగా అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన - ఈ ప్రాంతాల్లోనే

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!