ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదేలే- ఇప్పటం బాధితులకు పరిహారం పంపీణి పవన్ రెడీ
చెక్‌ల పంపిణీని కూడా ఇప్పటం గ్రామంలోనే చేయాలని జనసేన నాయకులు భావించారు. అయితే గ్రామంలో శాంతి భద్రతల సమస్యగా వస్తుందని వేదికను మార్చారు.
ఈ నెల 27న పవన్ కల్యాణ్ విజయవాడకు రానున్నారు. ఇప్పటం గ్రామస్థులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు నష్టపరిహారాన్ని పవన్ పంపణి చేయనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే బాధితులను కలుసుకొని వారికి చెక్‌లను అందించనున్నారు.
ఇప్పటం- వివాదం
ఇప్పటం గ్రామంలో ఇటీవల ప్రభుత్వం ఇళ్ళు తొలగించిన వ్యవహరంలో జనసేన అధినేత పవన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్సించి నష్టపోయిన వారికి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కూల్చివేతలు జరిగిన 24గంటల లోపే బాదితులకు పరామర్శించి అండగా ఉంటామని, భరోసా ఇచ్చిన పవన్..ఆ తరువాత రెండు రోజులకే బాధితులకు ఆర్థిక సహయాన్ని కూడా ప్రకటించారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది.
జనసేన వార్శికోత్సవ సభ నిర్వాహణ వేదిక దొరకని పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవటానికి ఇప్పటం గ్రామస్థులు స్దలాన్ని అందించారు. ఆ తరువాత నుంచి ఇప్పటం గ్రామంలో రాజకీయాలు మొదలయ్యాయి. పవన్ సభ నిర్వాహణకు వేదిక కోసం స్థలాన్ని ఇచ్చిన గ్రామస్దులపై ప్రభుత్వం కక్షసాదింపు చర్యలకు పాల్పతుందనే విమర్శలు వచ్చాయి. తాజాగా గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇటీవల స్థానిక అధికారులు నిర్మాణాలను తొలగించారు. వ్యవహరం రాజకీయంగా సంచలనంగా మారింది.
అధికారులు, ప్రభుత్వం తీరుపై ఇప్పటం గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు తమ నిర్మాణాలను తొలగించటంపై గ్రామంలో అలజడి రేగింది. కొందరు నివాసితులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయితే అధికారులు ఇచ్చిన నోటీసులను కోర్టు ముందు దాచిపెట్టటంతో న్యాయస్థానం అఫిడవిట్‌లను దాఖలు చేసిన వారికి జరిమానా విధించింది. ఎకంగా లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయస్థానం అఫిడవిట్‌దారులకు ఆదేశాలు ఇవ్వటం చర్చనీయాశంగా మారింది.
ఈ వ్యవహరంపై అధికార పక్షం తీవ్రస్థాయిలో మండిపడింది. కేవలం రాజకీయాల కోసమే ఇప్పటం గ్రామాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ వాడుకున్నారంటూ, వైసీపీ నేతలు మండిపడ్డారు. న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించి తమ వైఖరిని బయటపెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆర్థిక సహయం వద్దంటూ బ్యానర్లు...
పవన్ ప్రకటించిన ఆర్థిక సహయంపై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. చిన్న విషయాలు రాజకీయాలకు వాడుకొని, దాన్ని నిజం చేసేందుకు ఇచ్చే నష్టపరిహరం తమకు వద్దంటూ కొందరు గ్రామస్థులు తమ ఇంటి ముందు బ్యానర్లను కూడా ప్రదర్శించారు. మరికొందరు నష్టపరిహరం తీసుకునేందుకు రెడీ అయ్యారు. పవన్ చేస్తున్న రాజకీయంపై వైసీపీ కూడా అదే స్థాయిలో ఎదురు దాడి చేసింది. మొదట ప్రకటించిన 50లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదంటూ జనసేన అధినేత పవన్‌పై విరుచుకుపడుతోంది వైసీపీ. మరోవైపున పవన్ ప్రకటించిన 50లక్షల సహయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశాలు ఇవ్వటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే అసలు వివాదానికి కారణమని కొందరు గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.
ఇచ్చిన హామీపై క్లారిటీ ఇచ్చేందుకు
పవన్ కల్యాణ్ గ్రామం సంక్షేమం కోసం మొదట 50లక్షల రూపాయలు ఆర్థిక సహయాన్ని ప్రకటించారు. అయితే వాటిని ప్రభుత్వ తన ఖాజానకు మళ్లించే ఏర్పాట్లు చేయటంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆ తరువాత ఇళ్ళ నిర్మాణాల తొలగింపు వ్యవహరం తెర మీదకు వచ్చింది. దీంతో పవన్ మరోసారి లక్ష రూపాయలు ప్రకటించారు. మొదట ఇస్తానన్న 50లక్షలకు వైసీపీ అడ్డంకులు వేసినందన ఇప్పుడు ఇచ్చే లక్ష రూపాయలు నేరుగా బాధితుల ఖాతాలోకి చెక్ రూపంలో వెళ్లనుంది. అందుకే యుద్ద ప్రాతిపదికన ఆర్థిక సహయాన్ని పంపిణిచేసేందుకు జనసేన రంగం సిద్దం చేసింది.
ఆఖరి నిమిషంలో వేదిక మార్పు
వాస్తవానికి చెక్‌ల పంపిణీని కూడా ఇప్పటం గ్రామంలోనే చేయాలని పార్టీ నాయకులు భావించారు. అయితే ఇప్పటికే గ్రామంలో పరిస్థితులు, రాజకీయాలకు వేదిక కావటంతోపాటుగా శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యగా మారింది. దీంతో పవన్ సూచన మేరకు 53మంది బాధితులను పార్టీ కార్యాలయానికి ఆహ్వనించి వారికి పవన్ స్వయంగా ఆర్థిక సహయం అందించనున్నారు.