Pawan Kalyan: విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో పవన్ కల్యాణ్, వారాహిపైకి ఎక్కి అభివాదం
కనకదుర్గ ఆలయం నుంచి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ జనసేన నేతలకు అందుబాటులో ఉంటారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన ప్రచార రథం వారాహికి ఆలయంలో వాహనపూజ నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్ తొలిసారి వారాహి వాహనం పైకి ఎక్కి ప్రసంగించారు. అక్కడి నుంచే ఆయన జనానికి అభివాదం చేస్తూ వెళ్లారు. పవన్ కల్యాణ్ దుర్గ గుడికి రావడంతో పక్కనే ఉన్న ఫ్లైఓవర్ సహా రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి. పవన్ కల్యాణ్ ను చూసిన జనం హుషారుతో, ఉత్సాహంతో నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూల వర్షమై కురిసిన అభిమానం
— JanaSena Party (@JanaSenaParty) January 25, 2023
వారాహి పూజ అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంపైకి ఎక్కి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నుంచి అభిమానులు జనసేనానిపై పూల వర్షం కురిపించారు.
Album Link: https://t.co/qd7tFmiNYg pic.twitter.com/XLzEGLSaf6
తొలుత ఆలయానికి కారులో చేరుకున్న పవన్ కల్యాణ్ దుర్గమ్మను దర్శించుకున్నారు. పవన్‌కు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గుడిలో ప్రత్యేక పూజలు చేశాక, వాహనానికి పవన్ పూజ చేయించారు.
అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలను పవన్ కళ్యాణ్ సమర్పించారు. పవన్ కళ్యాణ్ కి, నాదెండ్ల మనోహర్ కి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో భ్రమరాంబ, అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారికి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
డప్పు చప్పుళ్లు, బాణ సంచా పేలుళ్లతో విజయవాడ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. దుర్గమ్మ ఆలయం బయట ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలతో సత్కరించారు. తన కోసం తరలి వచ్చిన ఆశేష జనవాహినికి ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియచేశారు.#Varahi pic.twitter.com/kFpEcOmGD5
— JanaSena Party (@JanaSenaParty) January 25, 2023
ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రి వచ్చానని అన్నారు. కొండగట్టులో వారాహికి పూజలు చేయించానని, ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. ఆంధ్ర అంతా సుభిక్షంగా ఉండాలి. కొత్త లీడర్లు రావాలని ఆకాంక్షించారు. రాక్షస పాలనను తరిమికొట్టడమే వారాహి లక్ష్యం అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.
రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం
— JanaSena Party (@JanaSenaParty) January 25, 2023
* విజయవాడలో వారాహి ప్రచార రథం నుంచి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
* దుర్గమ్మకు శ్రీ @PawanKalyan గారు ప్రత్యేక పూజలు#Varahi pic.twitter.com/Lq9tlEXmOo
అనంతరం జనసేనాని మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన నేతలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు. నేడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైఎస్ఆఱ్ సీపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై పార్టీ ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.