ముఖ్యమంత్రి జగన్ చైర్‌లో మంత్రి అమర్నాథ్, వీళ్ళ పోకడలకు అర్థం లేదంటూ టీడీపీ వ్యంగ్యాస్త్రాలు
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ వ్యవహారశైలి హాట్ టాపిక్ గా మారింది. అమరావతిలోని సచివాలయంలో పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు.
TDP Attacks Minister Amarnath : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ (Amarnath )వ్యవహారశైలి హాట్ టాపిక్ గా మారింది. అమరావతిలోని సచివాలయంలో పరిశ్రమల శాఖ (Review On Industris) పై సమీక్ష నిర్వహించారు. ఇక్కడ వరకు కథ ఒకే...అయితే ముఖ్యమంత్రి (Cm Jagan Chair) కుర్చీలో కూర్చోని...అధికారులతో సమీక్ష నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ( Tdp ) సెటైర్లు పేలుస్తున్నారు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసెంబ్లీ సీటు ఇవ్వలేదని...సెక్రటేరియట్ కు వెళ్లి ఏకంగా సీఎం సీట్లో కూర్చున్నాడంటూ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి కుర్చీ అంటే కేవలం చైర్ కాదని, అదొక హోదా అని...వీళ్లకు అర్థం కాదన్నారు. వీళ్ళ పోకడలకు అర్థం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు...తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఒక్క ఫోన్ కాల్‌తో అండగా ఉంటుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో రూ.4,883 కోట్ల పెట్టుబడులు
రాష్ట్రంలో రూ.4,883 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌సహా పలు సంస్థల పరిశ్రమలకు... ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.655 కోట్లతో నెలకొల్పిన ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించారు. సుమారు రూ.4,833 కోట్ల పెట్టుబడుల ద్వారా 4,046 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రిలయన్స్ బయో ఎనర్జీ రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్ధాల నుంచి బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. .1,024 కోట్ల పెట్టుబడితో తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో బయో గ్యాస్ ప్లాంట్లను నెలకొల్పుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,700 కోట్ల పెట్టుబడితో మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు...
— Dhulipalla Narendra Kumar (@DhulipallaNk) February 14, 2024
పోటీకి సీటు ఇవ్వలేదని... సెక్రటేరియట్ కు వెళ్లి ఏకంగా సీఎం సీట్లో కూర్చున్నాడు.
ముఖ్యమంత్రి కుర్చీ అంటే కేవలం చైర్ కాదు...అదొక హోదా! వీళ్లకు అర్థం కాదు....వీళ్ళ పోకడలకు అర్థం లేదు.@AndhraPradeshCM@gudivadaamar#APHatesJagan https://t.co/KfX3CCwbEA
రాష్ట్రంలో రూ.4,883 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌సహా పలు సంస్థల పరిశ్రమలకు వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
— YSR Congress Party (@YSRCParty) February 14, 2024
సీఎం @ysjagan గారు చెప్పినట్టు మా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఒక్క ఫోన్ కాల్‌తో అండగా ఉంటుంది
-మంత్రి గుడివాడ అమర్నాథ్… pic.twitter.com/9Zx4DkcLt7