News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Krishna: వాసన వస్తోందని వృద్ధురాలిపై దాడి - ఇంట్లోంచి వెళ్లగొట్టిన పక్కింటి మహిళ

Krishna: పక్కింట్లో ఉన్న వృద్ధురాలు నుంచి దుర్వాసన వస్తోందంటూ.. ఓ మహిళ ఆమెపై దాడి చేసింది. పడుకున్న వృద్ధురాలి చేయి పట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది.

FOLLOW US: 
Share:

Krishna: అసలే వృద్ధురాలు. అందులోనూ ఆమె ఒంటరి మహిళ. తన సొంత ఇంట్లోనే ఉంటూ.. తోచినకాడికి వంట చేసుకుంటూ కాలం గడుపుతోంది. అయితే ఈ మధ్య ఆమెకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయి. కారణంగా ఆమె వద్ద నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో వృద్ధురాలు కూడా బయటకు రాకుండా ఇంట్లోనే కాలం వెళ్లదీస్తోంది. కానీ ఆమె ఇంట్లో ఉన్నప్పటికీ.. తమకు విపరీతమైన దుర్వాసన వస్తోందంటూ పక్కింటి మహిళ గొడవకు దిగింది. ఇంట్లో నుంచి వృద్ధురాలిని ఈడ్చుకొచ్చి రోడ్డుపై పడేసింది. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ దాడి చేసింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ఘటననూ చూస్తూ వీడియోలు, ఫొటోలు తీశారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

కృష్ణా జిల్లా నూజివీడులో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లిందో మహిళ. చాట్రాయి మండలం గుడిపాడులో అడిమిల్లి లూర్దమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. అయితే ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె వద్ద నుంచి దుర్వాసన వస్తోంది. స్నానం కూడా చేసే ఓపిక లేకపోవడంతో.. అలాగే ఉంటోంది. అయితే పక్కింటి వాళ్లు తరచుగా ఆ వృద్ధురాలిపై కోపం చూపిస్తున్నారు. అంతా దుర్వాసన వస్తోందంటూ తిడుతున్నారు. ఇంటి పక్కనే ఉండే సికాకొల్లు శ్యామల అనే మహిళ అయితే.. వృద్ధురాలి నుంచి భరించలేని దుర్వాసన వస్తోందని ఆమెను బయటకు ఈడ్చుకొచ్చింది. ఇంట్లో పడుకున్న వృద్ధురాలి చేయి పట్టుకొని బయట రోడ్డు మీద వరకూ తీసుకొచ్చింది. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ, తిడుతూ.. ఇక్కడ ఉండకూడదు నువ్వు అంటూ హెచ్చరించింది. 

స్థానికులు అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారే తప్ప ఒక్కరూ కూడా ఆమెకు ఎదురు చెప్పలేదు. కనీసం వృద్ధురాలిని అలా వేధించకని కూడా కోరలేదు. వీడియోలు, ఫొటోలు తీస్తూ... సినిమా చూసినట్లు చూస్తుండిపోయారు. స్థానికుల ద్వారా వైరల్ గా మారిన ఈ వీడియో పోలీసుల వరకు చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Chandrayaan-3: చంద్రుడు, భూమి ఫోటోలు తీసిన చంద్రయాన్-3, ట్విట్టర్‌లో షేర్ చేసిన ఇస్రో

పామర్రులో దారుణం..

కృష్ణా జిల్లాలోని పామర్రు మండలం జమీగొల్వేపల్లి లో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. డెబ్బై సంవత్సరాల వయస్సులో అల్లుడు చేతిలో మామ దారుణ హత్యకు గురయ్యాడు. షేక్ అల్లా బక్షు ను అల్లుడు మీరావలి మెడపై దారుణంగా గాయపరిచాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన స్దానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. హత్య ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ హత్యకు మామ, అల్లుడు మధ్య మద్యం వివాదం కారణంగా జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మీరావలి ప్రతి రోజు మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతున్నాడు. నిత్యం తాగి వచ్చి గొడవ పడటం, కుటుంబ సభ్యులను భార్య కూడ కొడుతుండంతో మామ అల్లా భక్షు అనేక సార్లు అల్లుడు మీరా వలిని మందలించాడు. ఇదే క్రమంలో సొమరవారం కూడ ఇరువురు మద్య వాగ్వాదం జరిగింది. ఆదివారం నాడు ఫుల్ గా మధ్యం సేవించి వచ్చిన అల్లుడు మీరావలి భార్య, ఇతర కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపంలో ఉన్న అల్లుడు మీరావలి మామ మెడ పై కర్రతో దాడి దాచేశాడు.

Published at : 10 Aug 2023 09:30 PM (IST) Tags: Krishna Krishna district News Old Lady Woman Attack Bad Odour

ఇవి కూడా చూడండి

Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

AP Liquor Policy: మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్

AP Liquor Policy: మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

Pawan Kalyan: 1 నుంచి పవన్ వారాహి యాత్ర, సీఎం జగన్ ప్రభుత్వమే టార్గెట్!

Pawan Kalyan: 1 నుంచి పవన్ వారాహి యాత్ర, సీఎం జగన్ ప్రభుత్వమే టార్గెట్!

టాప్ స్టోరీస్

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?