Kodali Nani: చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా - కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
Kodali Nani: అవినీతి చేస్తే అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి ఘాటు విమర్శలు చేశారు.
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతి చేస్తే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు గడుస్తున్నా చంద్రబాబు నాయుడు ఐటీ నోటీసులపై ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు. పాలు అమ్మితే పది వేల కోట్ల ఆదాయం వస్తుందా అంటూ నిలదీశారు. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాధించలేరని చెప్పారు. దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే.. చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఏ నాయకుడు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా ప్రజలు దాని గురించి మాట్లాడుకోవాలి కానీ.. చంద్రబాబే వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ మరీ ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ కట్టానని చెప్పుకుని తిరిగే చంద్రబాబుకు అక్కడ డిపాజిట్ కూడా రాదని విమర్శించారు. ఏపీలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే రాష్ట్ర సంపదని దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడ్రోజులే క్రితమే చంద్రబాబుపై ఫైర్ అయిన కొడాలి నాని
చంద్రబాబుకు సింగపూర్‌లో హోటళ్లు ఉన్నాయని.. అవి ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. చట్టాలను అడ్డంపెట్టుకుని టీడీపీ హయాంలో చంద్రబాబు దోచుకున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ నేర్పిందే చంద్రబాబు అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 1999లోనే ఒక్కో అభ్యర్థికి రూ.కోటి ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలల్లో 5 నుంచి రూ. 30 కోట్ల వరకూ ఇచ్చి టీడీపీ అభ్యర్థుల తరపున ఓట్లు కొనుగోలు చేశారన్నారు. అలా దాదాపు రూ. 10 వేల కోట్ల వరకూ టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చారని కొడాలి నాని చెప్పారు. 2014 ఎన్నికల్లో జగన్ డబ్బులు పంచి ఉంటే అప్పుడే సీఎం అయ్యే వారని వ్యాఖ్యానించారు. జగన్ 2014లో ఓడిపోయారని, ఆ తర్వాత ఎవరినైనా కలిశారా ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే గెలిచి అధికారంలోకి రాలేదా అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల నుంచి చంద్రబాబు ఈసారి కూడా తప్పించుకోలేరని కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
1999 లోనే ఒక్కో అభ్యర్ధికి కోటి చొప్పున ఇచ్చాడన్నారు. ఆ తర్వాత ఎన్నికలలో వరసగా 5, 10, 20, 30 కోట్ల రూపాయలు చొప్పున అభ్యర్దులకు ఇచ్చారని పదివేల కోట్లరూపాయలు తన పార్టీ అబ్యర్దులకు చంద్రబాబు ఇచ్చాడనేది వాస్తవమని తెలిపారు. ఈ డబ్బు అంతా చంద్రబాబుకు ఎలా వచ్చిందంటే కమీషన్లు తీసుకోబట్టే కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చిన 118 కోట్లు అనేది చాలా తక్కువ మొత్తం ఇధి రికార్డుగా దొరికిన డబ్బు మాత్రమే...లక్ష కోట్లు వరకు దోచుకున్నాడని ఆరోపించారు. హెరిటేజ్ ద్వారా ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చంద్రబాబు చెప్పాలన్నారు. పాలు,పెరుగు,అమ్మే వాళ్లు చాలా మంది ఇప్పటికీ అలాగే ఉన్నారని.. ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబేనని అన్నారు.