అన్వేషించండి

Secret Marriage: భార్యకు తెలియకుండా భర్త సీక్రెట్ పెళ్లి, సరిగ్గా తాళి కట్టే టైంకి అవాక్కైన ఫ్యామిలీ!

భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా భార్యే అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన ఆదివారం జరిగింది.

భార్యకు తెలియకుండా గుట్టుగా మరో మహిళను పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి బాగోతం తాజాగా బయటపడింది. రహస్యంగా జరుగుతున్న పెళ్లిని భార్యే గుర్తించి మధ్యలోనే నిలిపి వేయించింది. తనకు తెలియకుండానే మరో మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని భార్య ఆవేదన చెందింది. భర్త తనకు తెలియకుండా ఇలా రెండో పెళ్లి చేసుకొనేందుకు యత్నించడం ఇదేం మొదటిసారి కాదని, గతంలో రెండుసార్లు గుట్టుగా పెళ్లి చేసుకుంటుంటే తాను ఆపేసినట్లుగా తెలిపింది. క్రిష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా భార్యే అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన ఆదివారం జరిగింది. నిందితుడిది తెలంగాణలోని నల్గొండ జిల్లా. భువనగిరి ప్రాంతానికి చెందిన చెరుకుమల్లి మధు బాబు అనే వ్యక్తికి హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన సరిత అనే యువతితో నాలుగేళ్ల క్రితమే వివాహం జరిగింది. కొన్నేళ్లకు అత్తగారింటి వారు వరకట్న వేధింపులకు పాల్పడ్డారు. దీంతో గత మూడేళ్లుగా సరిత పుట్టింటికి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ ఉంది. తనపై వరకట్న వేధింపులకు పాల్పడ్డారని భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో సరిత అప్పుడే కేసు పెట్టింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ దశలో ఉంది.

ఇదిలా ఉండగా.. భర్త మధుబాబు గతంలో రెండు సార్లు వివాహం చేసుకోబోగా భార్య సరిత అడ్డుకుంది. ఈ సారి మధుబాబు కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించుకుని పెళ్లి చేసుకునేందుకు ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి వచ్చారు. ఆలయంలో పెద్ద తిరునాళ్లు కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడే ఉండే బేడా మండపంలో వివాహం గుట్టుగా జరుగుతుండగా.. సరిత ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా పెళ్లి కొడుకు మధుబాబుపై మెరుపు దాడి చేశారు. వెంటనే వివాహాన్ని అడ్డుకున్నారు. 

గతంలో జరిగిన వివాహం గురించి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు వీరంతా చెప్పడంతో.. వారు మధుబాబు కుటుంబ సభ్యులపై మండి పడి అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్లిపోయారు. మధుబాబును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. తర్జనభర్జనల అనంతరం ఇప్పటికే భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో కేసు విచారణలో ఉన్నందున పెనుగంచిప్రోలులో కేసు అవసరం లేదని వెళ్లిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget