Andhra Pradesh: అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు- అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన- గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో కలకలం
Vijayawada: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
![Andhra Pradesh: అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు- అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన- గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో కలకలం Gudlavalleru Engineering College Students got angry and protested after seeing the Secret cameras in the girls hostel bathroom Andhra Pradesh: అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు- అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన- గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో కలకలం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/30/144019d8b2b573f4e87e678b937fbac61724986141688215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna District: తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే మరో ఘోరం కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మాయి హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దుర్ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది. దీన్నో బిజినెస్ మోడల్‌గా చేసుకొని అబ్బాయిలు తమకు నచ్చిన వ్యక్తుల వీడియోలు తెప్పించుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ కాలేజీల్లో ఒకటి గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్. ఇలాంటి కాలేజీలోనే ఈ దారుణం వెలుగు చూసింది. ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో ఓ కెమెరా ఉండటాన్ని విద్యార్థులు గుర్తించారు. దీనిపై హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేయడం అందరి కాళ్ల కింద భూమి కుంగిపోయే నిజాలు బయటపడ్డాయి.
బాయ్‌ఫ్రెండ్ కోసం
ఇదంతా చేసింది ఓ అమ్మాయే అన్న విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినే ఈ దారుణానికి పాల్పడింది. తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టింది. ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు తీయిస్తున్నట్లు గుర్తించారు.
గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉమెన్స్ వాష్ రూమ్ లో కెమెరా పెట్టి వీడియోలు చిత్రికరణ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది... 😡😡😡
— B̶L̶I̶N̶D̶ M̶A̶N̶ (@blind__mann) August 29, 2024
ఎం లుచ్చా అధికారం రా మీది @JaiTDP 💦💦
ఎటు పోతుంది రా సమాజం విద్యాశాఖ మంత్రి ముండాలతో పడుకుంటున్నాడు 😡😡 pic.twitter.com/HaHFM8CxRi
ఫ్రెండ్స్ కోసం
ఇలా తీసిన వీడియోలను కాలేజీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా కూడా కాలేజీ వర్గాలు, విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు అర్థరాత్రి ఇంజినీరింగ్ కాలేజీలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ, హాస్టల్ యాజమాన్యంపై మండిపడ్డారు.
విద్యార్థిపై దాడి
అదే టైంలో ఇలాంటి పాడు పని చేసిన విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకూ ఈ ఘటనపై అధికారికంగా ఏ సమాచారం బయటకు రాలేదు. ఎంతమంది అమ్మాయిల వీడియోలను తీశారు దీనికి కారణం ప్రేమ వ్యవహారామా..లేదా ఘటనకు కారణమైన అమ్మాయిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాల్లోనూ సమాచారాన్ని అధికారులు బయటకు చెప్పటం లేదు. విద్యార్థులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు
గుడివాడ కాలేజీలో అమ్మాయిల స్నానాల గదుల్లో కెమెరాలు, ఇప్పటికే అనేక వీడియోలు మార్కెట్ లోకి? మెరుపు నిరసన కు దిగిన విద్యార్థినులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.#Gudivada #StudentsProtests #AndhraPradesh #UANow pic.twitter.com/vN5U19PH94
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) August 29, 2024
ప్రభుత్వంపై విమర్శలు
ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలను వైసీపీ నేతలు షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు లోకేష్, పవన్ కల్యాణ్, చంద్రబాబుకు ట్యాగ్ చేసి విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు నోరు విప్పడం లేదని అడుగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో సంచలనంగా మారుతోంది.
అయ్యా చంద్రబాబు గారు దేశవ్యాప్తంగా చీటింగ్ కేసులు ఉన్న ముంబై మోడల్ మీద పెట్టిన శ్రద్ధ మన రాష్ట్ర ఆడ బిడ్డల మీద పెడితే ఇలాంటి సంఘటనలు జరగవు
— 𝐘𝐒𝐉 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@2029YSJ) August 30, 2024
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో లేడీస్ వాష్ రూమ్స్ లో CC కెమెరాలు......300 పైగా వీడియోలు రికార్డు చేసి బాయ్స్ హాస్టల్ వాళ్ళకి అమ్మేసారు pic.twitter.com/68gKsPHVi6
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)