By: ABP Desam | Updated at : 03 Feb 2022 01:19 PM (IST)
ఆంక్షలు ఛేదించుకొని విజయవాడ చేరుకున్న ఉద్యోగులు
చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులు చేసిన ప్రయత్నాన్ని ఎక్కడికక్కడ పోలీసులు నిలువరించారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే నెల్లూరు జిల్లా సహా చాలా ప్రాంతాల్లో కొంతమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు.. పోలీసులకే మస్కా కొట్టారు.
ఆత్మకూరుకి చెందిన ఓ ఉపాధ్యాయుడు పెరాలసిస్ రోగిలాగా గెటప్ వేసి పోలీసుల కన్నుగప్పి రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. ఎంచక్కా విజయవాడ వెళ్లిపోయాడు. విజయాడ చేరుకున్నాక.. ఆయన కొలీగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఎరుపెక్కిన బెజవాడ..!!#ChaloVijayawadapic.twitter.com/R5Zt1jIsAu
— Raghu తెలుగోడు (@raghu_telugu__) February 3, 2022
నెల్లూరు పోలీస్ స్టేషన్లోనే ఓ టీచర్ కూలీ అవతారం ఎత్తాడు, మరో టీచర్ పెళ్లిళ్ల పేరయ్యలాగా పంతులు గెటప్ వేసుకున్నాడు. వీళ్లంతా పోలీసులకు మస్కా కొట్టి బెజవాడ చేరుకున్నారు.
చలో విజయవాడలో భాగంగా ప్రభుత్వ నిర్బంధాలను, పోలీసు బలగాలను అధిగమించి బీఆర్టీఎస్ వద్దకు 13 జిల్లాల నుంచి కదలివచ్చిన వేలాది ఉద్యోగులు, ఉపాధ్యాయులు. #SaveAPFromYSRCP #ChaloVijayawada #PRC pic.twitter.com/Fcaw0tL6QR
— Sai Royal PSPK™ (@sai_usthaad) February 3, 2022
ఇక మిగతా వారంతా ప్లానింగ్ లేక పోలీసులకు చిక్కారు. ఇలా బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో దొరికిన ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాల నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్లోనే ఉద్యోగులు నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగిరావాలని, పీఆర్సీ సమస్యను పరిష్కరించాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Madhya tharagathi kadupukalithey ilaney untadhi..#ChaloVijayawada#PRC pic.twitter.com/zYQCMyOjn9
— చిత్తూరు చిన్నోడు (@ChittoorChinodu) February 3, 2022
గూడూరులో కూడా విజయవాడ రైళ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఉద్యోగులు కామన్ మ్యాన్ గెటప్ వేసినా అక్కడ పోలీసులు వారిని పట్టేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విజయవాడ వెళ్లకుండా అడ్డుకున్నారు.
కర్నూలులోని కొందరు ఉద్యోగులు ఏకంగా పెళ్లిళ్ల బస్సులో విజయవాడ చేరుకున్నారు.
ఎక్కడున్నారు @ysjagan ఆన్నియా & కో #SaveAPFormYSRCP #ChaloVijayawada #PRC pic.twitter.com/J4eGbhnOYp
— Missile PawanKalyan™ (@MissilePSPK) February 3, 2022
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్లో బిగ్ డీల్
Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్ఫ్లవర్ ఆయిల్ ధరపై..!