By: ABP Desam | Updated at : 04 Jan 2023 03:29 PM (IST)
వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు
విజయవాడ: ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాదు అని, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతారని.. 2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. పైకి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కొందరి పతనం ఖాయమన్నారు. తాను గుడిసె గుడిసె తిరిగానని, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రజలు తిడుతున్నారని.. ఇళ్లల్లో వంద రూపాయలు కూడా లేని పరిస్థితిని గమనించానని చెప్పారు. 2024లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతారన్న ఆయన, మూడు, నాలుగు స్థానాల్లో వైసిపి, పవన్ పార్టీలు ఉంటాయని జోస్యం చెప్పారు.
పెట్రోల్ ధర వంద కావాలంటే రూపాయి విలువ పతనం కావాలని మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారని, అయితే నేడు బిజెపి పతనం ప్రారంభం అయ్యిందని, ఇక తిరిగి కోలుకునే ఛాన్స్ లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ రాజకీయ పరిస్థితిని తాను 18యేళ్ల క్రితమే ఊహించి, ఆనాడే అధిష్టానానికి వివరంగా లేఖ రాసి ఇచ్చానని తెలిపారు. 2004లోనే మా పార్టీ వాళ్లకు నేనే చదివి స్వయంగా వినిపించాను. కాంగ్రెస్ పార్టీ పతనాన్ని తాను అప్పుడే ఊహించి చెప్పానని పదే పదే ప్రస్తావించారు. చంద్రబాబు సభలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావడంపై తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూస్తే, దేశంలో పేదోళ్ల పరిస్థితి అర్థం అవుతుందన్నారు.
సంక్రాంతి కానుకగా రూ.1500 విలువ చేసేవి పేదలకు ఇచ్చారు. అయితే 3500 మందికి కానుక ఏర్పాటు చేస్తే, వేలాది మంది తరలి వచ్చారని, దాంతో టోకెన్ లు ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఉచితంగా ఇస్తామంటే రాని పేదవాళ్లు ఉండరని, ఇలాంటి వాటిని సాకుగా చూపి ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవోలు ఇవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ ఉన్న దేశంలో మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.
ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్
చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెళ్లి తెలంగాణలో సభలు నిర్వహిస్తుంటే, కేసీఆర్ ఏపీకి వచ్చి సభలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ దివంగత ఎన్టీఆర్ లాగ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా దేశానికి ప్రధాని కావాలని ఆశ ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
మీరంతా కాంగ్రెస్ లోకి రండి, మిమ్మల్ని సీఎం చేస్తాం !
2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని, కాపులంతా కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కాపులను సీఎం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ హామీ ఇచ్చారు. 1959-60 నాటి పరిస్థితి ఏపీలో మళ్లీ కనిపిస్తుందన్నారు. కిలో బియ్యం కోసం పేదలు ఎదురు చూస్తున్నారని, టిడిపి, వైసిపి విధానాల వల్ల ప్రతి పేదవాడు అప్పుల పాలయ్యాడని.. ఏపీలో తాము ఓటేసిన ఫ్యాన్ తమను మోసం చేసిందనే ఆక్రోశం ప్రజల్లో ఉందన్నారు. ఏపీలో పేద ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని, వైసిపిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
AP High Court: ఎస్ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?
Sagar Water Release: సాగర్ ప్రాజెక్టు నుంచి దౌర్జన్యంగా నీటి విడుదల - షాక్ ఇచ్చిన తెలంగాణ అధికారులు
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్ఐఏ కౌంటర్
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
/body>