Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవరి 25న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన ప్రచార రథం వారాహికి ఆలయంలో వాహనపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక చీరను సమర్పించారు.
వారాహివాహానికి దుర్గ గుడిలో పూజ చేసిన సందర్భంగా పవన్ సమర్పించిన చీరకు భారీ డిమాండ్ ఏర్పడింది. బెజవాడ దుర్గగుడిలో భక్తులు సమర్పించిన చీరలను ఏటా వేలం వేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ చీరల్లో పవన్ కల్యాణ సమర్పించిన చీర ఉండటంతో అంతా దాన్ని కొనేందుకు పోటీ పడుతున్నారట. దీంతో ఆ చీరల కాంట్రాక్టర్‌పై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవరి 25న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన ప్రచార రథం వారాహికి ఆలయంలో వాహనపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక చీరను సమర్పించారు. ఎనిమిదివేల రూపాయల ఖరీదు అయిన ఆ చీర అప్పట్లోనే చాలా మందిని ఆకర్షించింది. ఇప్పుడు దుర్గ గుడిలో ఉన్న ఆ చీరను వేలంలో ఎంతకైనా దక్కించుకోవాలని జనం పోటీ పడుతున్నారట.
దుర్గగుడి అమ్మవారికి పవన్ సమర్పించి చీర పూజా కార్యక్రమాల తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్ వద్దకు చేరింది. దీంతో పవన్ ఇచ్చిన ఆ చీరను దక్కించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు పోటీ పడుతున్నారని టాక్ నడుస్తోంది. ఎంత రేట్ అయినా ఫర్వాలేదు తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయట. దీంతో ఆ కాంట్రాక్టర్ తల పట్టుకున్నారని సమాచారం.
గతంలో కూడా చిరంజీవి దంపతులు సమర్పించిన చీర కోసం ఇలానే పోటాపోటీగా అభిమానలు ఆ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక సరికొత్త ఆలోచన చేశారా కాంట్రాక్టర్. చిరంజీవి ఇచ్చిన చీరను అదే ఫ్యామిలీకు చెందిన వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడు అందివ్వాలని ప్లాన్ చేశారు. అలా దుర్గాదేవికి చిరంజీవి ఇచ్చిన చీరను తర్వాత కాలంలో దర్శనానికి వచ్చిన అల్లు అరవింద్ దంపతులకు కానుకగా ఇచ్చారు. దీంతో అప్పటికి ఆ సమస్యకు పరిష్కారం లభించింది.
ఇప్పుడు కూడా అదే తరహాగా ప్లాన్ చేయాలి దుర్గగుడి చీరల కాంట్రాక్టర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దుర్గమ్మ చీర, అందులో పవన్ కల్యాణ్ సమర్పించిన చీర అందుకే ఆ శారీకి అంత డిమాండ్. అందుకే ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కే ఆ చీర కూడా ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఈసారి దుర్గ గుడిని సందర్శించుకుంటే పవన్ కల్యాణ్ ఇచ్చిన చీరను కానుకగా ఇచ్చేయాలని ఆలోచిస్తున్నారట.
8 వేల రూపాయల ఖరీదు అయిన చీరను పవన్ కల్యాణ్ జనవరి 25న దుర్గమ్మకు సమర్పించారు. దేవీ ఆశీస్సులు తీసుకున్నారు. పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తర్వాత వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు చేసి విజయవాడ నగర వీధుల్లో ర్యాలీ చేపట్టారు. అందర్నీ పలకరిస్తూ సందడిగా సాగిందీ యాత్ర.
వారాహి నుంచి తొలిసారిగా ఏపీలో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రానీయకుండా చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తానంటూ చెప్పారు. ప్రజలను హింసిస్తున్న పాలకులను ఇంటికి పంపించాల్సిన టైం వచ్చిందన్నారు.