అన్వేషించండి

పెళ్లిని ఆపేసిన ఫేస్‌బుక్ పరిచయం- కేసుల్లో ఇరుకున్న స్నేహితులు, బంధువులు

గుడివాడలో జరిగిన ఘటన యువతీ యువకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతోంది. సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి ప్రమాదానికి దారి తీస్తాయో ఎందరి జీవితాలను కేసుల్లో ఇరికిస్తాయో రూడీ చేసింది.

సోషల్ మీడియా పరిచయం రెండు మూడు కుటుంబాలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. పది మంది వరకు కేసుల్లో ఇరుక్కున్నారు. ఓ యువతి చేసిన పని ఇప్పుడు అందరూ తలదించుకోవాల్సి వచ్చింది. 

ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో జరిగిన ఘటన యువతీ యువకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి ప్రమాదానికి దారి తీస్తాయో... ఎందరి జీవితాలను కేసుల్లో ఇరికిస్తాయో రూడీ చేసింది. గుడివాడకు చెందిన ఓ యువతికి ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు న్యూటన్ బాబు. సరదాగా మొదలైన ఈ పరిచయం తర్వాత చాలా మలుపులు తిరిగింది.

గుడివాడ టూటౌన్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... న్యూటన్ బాబుతో ఆమె పరిచయం కాస్త మరింత దూరం తీసుకెళ్లింది. మొబైల్‌ నెంబర్‌ల షేరింగ్‌... తర్వాత వాట్సాప్ చాటింగ్‌ అబ్బో మాటలు, రొమాంటిక్‌ మేసజ్‌లతో టైం చాలా ఫాస్ట్‌గా సాగిపోయింది. చాటింగ్‌తో ఆగని వీరిద్దరు... ఫిజికల్‌గా కూడా దగ్గరయ్యారు. ఫైనల్‌ డెస్టినేషన్‌కు చేరుకున్నాక అడ్డులేదనుకున్నారేమో. ఏకాతంగా ఉంటూనే సెల్ఫీలు తీసుకున్నారు. షేర్ చేసుకున్నారు. ఇలా కొన్ని నెలల పాటు సాగిందీ యవ్వారం. 

ఒకరితో ఒకరు వీడియో కాల్స్ మాట్లాడుకునేవాళ్లు. అందరిలా కాదు. వీళ్లు చాలా స్పెషల్. అందుకే నగ్నంగా వీడియోకాల్స్ చేసుకునేవాళ్లు. ఇలా ఇద్దరి మధ్య రిలేషన్ పీక్స్‌కు వెళ్లింది. అక్కడే వీళ్ల లవ్ స్టోరీకి ఎండ్‌కార్డు పడింది. కాదు కాదు... ఆ యువతే ఎండ్‌ కార్డు వేసేసింది. 

న్యూటన్ బాబుతో రిలేషన్‌లో ఉండగానే మరో వ్యక్తిని చూసింది. పెళ్లికి రెడీ అయింది. ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. మళ్లీ అక్కడే అదే సీన్స్ రిపీట్ అయ్యాయి. ఈ ఎపిసోడ్‌లో కూడా చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. లవర్‌తోనే చాలా దూరం వెళ్లి ఆమె... కాబోయే భర్తతో ఇంకెంత దూరం వెళ్లి ఉంటుందో ఊహించుకోండి. పెళ్లికి ముందే ఫిజికల్‌గా కూడా కలిశారు. వీళ్లు హద్దులు దాటేస్తున్నారని గ్రహించిన పెద్దలు పెళ్లి ముహూర్తం పెట్టేశారు. 

మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతుందన్న టైంలో వరుడి మొబైల్‌కు ఓ వీడియో వచ్చింది. అందులో ఉన్న బోల్డ్ కంటెంట్ చూసి గురుడు షాక్ అయ‌్యాడు. అందులో ఉన్న హీరోయిన్ తన భార్యే కానీ పక్కనే ఉన్నది తను కాదు వేరే వ్యక్తి. ఆ వీడియో చూసిన వరుడి బీపీ రైజ్ అయింది. 
వెంటనే  వీడియో పంపించిన వ్యక్తికి ఫోన్ చేశాడు. ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ వీడియో పంపింది తనకు కాబోయే భార్య మాజీ ప్రియుడు న్యూటన్ బాబేనని గ్రహించాడు. 

కాబోయే భార్య గురించి అసలు విషయం తెలిశా ఇంట్లో పెద్దలకు విషయాన్ని చెప్పాడు. వాళ్లు కూడా నమ్మకపోయేసరికి వీడియో చూపించాడు. అది చూసిన వాళ్లు కూడా ఆశ్చర్యంతో బిగుసుకుపోయారు. విషయాన్ని పెళ్లి పెద్దల ముందు పెట్టాడు. వాళ్లకు సాక్ష్యంగా వీడియో పంపించాడు. అత్తింటివారికి కూడా ఈ వీడియోను షేర్ చేసి మీ అమ్మాయి బాగోతం చూడండని మెసేజ్ చేశారు. 

ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కదరదని చెప్పేసిన వ్యక్తి... తనకు తెలిసిన వారందరికీ వీడియోను షేర్‌ చేశాడు. అప్పటికీ ఆవేశాన్ని ఆపోలేకపోయిన ఆ యువకుడు న్యూటన్ బాబు బంధువులకు కూడా పంపించాడు. ఇలా ఆ వీడియో లోకల్ గ్రూప్స్‌లో వైరల్‌గా మారిపోయింది. దీంతో అమ్మాయి తరఫువాళ్లు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందరూ ఫోన్లు చేసి అడగడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. 

వీడియోల షేరింగ్ ఆగకపోవడం, ఓవైపు బంధువుల నుంచి వస్తున్న ఫోన్లు దాటికి తట్టుకోలే అమ్మాయి తరఫు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఎంటరై... వీడియో తీసిన వ్యక్తి మొదలుకొని, వీడియో షేర్ చేసిన వివాహ పెద్దలు, కుటుంబ సభ్యులు అందరిపై కేసు పెట్టారు. గుడివాడ టూటౌన్ సీఐ బి. తులసీధర్ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఆధారాలు సేకరించారు. యవతిని బెదిరించి నగ్న వీడియోను చిత్రీకరించిన న్యూట్రన్ బాబుపై అత్యాచార యత్నం కేసు, కాబోయే భర్తపై అత్యాచారం కేసు, పెళ్లి పెద్దలు, ఇతర బంధువులపై 109, 120(బి) ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget