అన్వేషించండి

Vijayawada News: డిప్యూటీ సీఎం కుమార్తె తెగువ, చీరల దొంగ ఆటకట్టించి పోలీసులకు అప్పగింత

Saree Gang in Vijayawada: విజయవాడలో క్లాత్ స్టోర్‌లో చీరలు దొంగిలించే ముఠా ఆట కట్టించారు నారాయణస్వామి కుమార్తె కృపా లక్ష్మి. దొంగను పట్టించిన కృపా లక్ష్మీని స్థానికులు, వ్యాపారులు ప్రశంసించారు.

Deputy CM Narayana swamy daughter Krupa Lakshmi: విజయవాడ: చీరలు దొంగిలించే ముఠా ఆటలు కట్టించారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపా లక్ష్మి. విజయవాడ నగరంలోని ఒక ప్రముఖ వస్త్ర దుకాణంలో చీరలు దొంగిలించిన మహిళను ధైర్య సాహసాలు ప్రదర్శించి పట్టుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విజయవాడలో క్లాత్ స్టోర్‌లో చీరలు దొంగిలించే ముఠా ఆట కట్టించారు నారాయణస్వామి కుమార్తె కృపా లక్ష్మి. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ బందర్ రోడ్ లోని పీవీపీ మాల్ సమీపంలో గోలి హ్యాండ్లూమ్స్ లో శనివారం నాడు షాపింగ్ కొరకు వెళ్లారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపా లక్ష్మి. ఈ సందర్భంగా తాను షాపింగ్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఐదుగురు మహిళలు ఖరీదైన చీరలు చూపించాలి అంటూ హడావుడి చేశారు. షాపులో సిబ్బంది ఖరీదైన చీరలు చూపిస్తుండగా ఒక ఐదు చీరలను దొంగిలించారు. ఈ విషయం షాపులో ఉన్న వారు ఎవరూ గమనించలేదు కానీ షాపు యజమాని ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు చూస్తూ ఉండంగా మహిళా దొంగలు చీరలు కాజేస్తున్నట్లుగా గమనించారు. ఈ విషయమై ఫోన్ ద్వారా సిబ్బందికి సమాచారం ఇచ్చే లోపల నలుగురు మహిళలు అక్కడి నుండి వెళ్లిపోయారు

ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపా లక్ష్మి బయటకు వచ్చి మహిళా దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. అంతేకాకుండా వెంటనే పోలీసులకు కూడా సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాచవరం పోలీసులు మహిళా దొంగను అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు, షాప్ సిబ్బంది కృపా లక్ష్మి చూపిన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దొంగను పట్టుకోవడానికి ఆమె చూపిన తెగువకు అభినందించారు. విలువైన చీరలు ఎత్తుకు వెళ్ళిన దొంగలు ఎలా పట్టుకోవాలని యజమాని సిబ్బంది ఆలోచిస్తుండగానే మహిళా దొంగలను ముందు నుంచి వారిని గమనించిన కృపా లక్ష్మీ బయటకు వచ్చి ఒక మహిళను గుర్తించి పోలీసులకు అప్పగించారు. చీరలు చోరీ చేసింది మహిళలు కాగా, అందులో ఓ దొంగను పట్టించిన కృపా లక్ష్మీని స్థానికులు, వ్యాపారులు ప్రశంసించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget