By: ABP Desam | Updated at : 25 Apr 2022 01:24 PM (IST)
బోండా ఉమ (ఫైల్ ఫోటో)
Vijayawada Gang Rape Issue: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైన ఘటనలో ప్రభుత్వం తీరుపై మంత్రి బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం జరిగిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతలు పరామర్శకు వెళ్లడం వల్లనే ప్రభుత్వం స్పందించిందని, బాధితురాలి మానానికి రూ.10 లక్షలు వెలకట్టి పరిహారం ప్రకటించిందని వ్యాఖ్యానించారు. అంతకుమించి ప్రభుత్వం ఏమీ చేయలేదని కొట్టిపారేశారు. హాస్పిటల్‌కు లాడ్జిలా మార్చేశారని నిలదీశారు. బాధితుల పక్షాన తాము నిలిచి న్యాయం జరిగేలా చూస్తే మహిళా కమిషన్ తరపున తమకు నోటీసులు ఇచ్చారని అన్నారు. సోమవారం బోండా ఉమ సహా టీడీపీ నేతలు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. గ్యాంగ్ రేప్ బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వాసిరెడ్డి పద్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఛాలెంజ్‌లు చేస్తున్నారని, ఎలా కమిషన్ ముందు హాజరుకారో చూస్తానంటూ ప్రతిష్ఠ దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. ‘‘వాసిరెడ్డి పద్మ మమ్మల్ని బెదిరిస్తోంది. మమ్మల్ని ఆకురౌడీలు, అరేయ్.. ఒరేయ్ అంటోంది. ఒక బజారు మనిషిలాగా మాట్లాడుతోంది. ఒసేయ్ అనే భాష మాకు రాదా? నువ్వు మహిళల హక్కుల్ని కాపాడడానికి ఉన్నావా? వైఎస్ఆర్ సీపీ హక్కుల్ని కాపాడడానికి ఉన్నావా? ఏంటి నీ అహంకారం? ఇలాంటి సంఘటనలు జరిగితే ఇంటికెళ్లి పరామర్శించి ప్రభుత్వంతో ఆర్థిక సాయం ఇప్పించాల్సింది పోయి అహంకారంతో మాట్లాడతావా? ఆ పని మేం చేస్తే చంద్రబాబు వచ్చిన సమయంలో ఆస్పత్రికి వచ్చి రాజకీయం చేసింది. అంతా రొచ్చు రొచ్చు చేసి సీఎం జగన్‌ను వాసిరెడ్డి పద్మ రోడ్డుమీద పడేసింది.
పబ్లిసిటీ పిచ్చిన వాసిరెడ్డి పద్మ జగన్‌ను రోడ్డున పడేసింది. బాధితులకు న్యాయం చేయాలని ఎండలో పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశాం. మేం చేసిన తప్పేంటి? ప్రజల ద్రుష్టికి తెచ్చాం. బాధితులకు న్యాయం జరగాలని చంద్రబాబు ప్రభుత్వ ఆస్పత్రికి రావడం ఆయన చేసిన తప్పా? ఘటన జరిగిన తర్వాత కూడా మేకప్‌లు వేసుకుంటూ ఇంట్లో ఉన్నావ్. విజయవాడలో ఉంటూ పరామర్శించడానికి రాలేదు. చంద్రబాబు వస్తున్నాడని తెలిసి మేకప్ వేసుకొని అక్కడికి వచ్చారు. ఆస్పత్రి రూంలో రచ్చ రచ్చ చేశారు.
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచార సందర్భాన్ని కూడా వాసిరెడ్డి పద్మ, వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోంది. అందులో భాగంగానే కక్ష పూరితంగా మాకు నోటీసులు ఇచ్చారు. మేం ఏం నేరం చేశాం? కలెక్టర్‌ను కలిసి బాధితులకు అండగా నిలబడాలని, వారికి ఇల్లు కూడా మంజూరు చేయాలని కోరాం. ఆయన దీన్ని పరిశీలిస్తామన్నారు. మాకు నోటీసుల్లో ఇచ్చిన గడువు 27లోపు ప్రభుత్వం స్పందించకపోతే మేం ఈ విషయంలో నిరసనలు ఇంకా పెంచుతాం.’’ అని బోండా ఉమ హెచ్చరించారు.
YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్
AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!