Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు
Bhavani Dweepam: నది మధ్యలో పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే భవానీ ద్వీపం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా అలరారుతోంది. కృష్ణమ్మ అలల సవ్వడి వింటూ బోటుపై విహారం మధురానుభూతిని పంచుతుంది.
Tourist Place in Vijayawada: నది మధ్యలో పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే భవానీ ద్వీపం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా అలరారుతోంది. కృష్ణమ్మ అలల సవ్వడి వింటూ బోటుపై చేసే విహారం మధురానుభూతిని పంచుతుంది. కృష్ణమ్మ అలల సవ్వడి వింటూ బోటుపై చేసే విహారం మధురానుభూతిని పంచుతుంది. ఆహ్లాదంతోపాటు ఆనందాలు పంచుతూ పర్యాటకుల ఫేవరేట్ స్పాట్‌గా నిలిచిన భవానీ ఐలాండ్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందామా..
కృష్ణమ్మ ఒడిలో పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే భవానీ ద్వీపం దేశంలోనే అరుదైన ద్వీపాల్లో ఒకటిగా అలరారుతోంది. భవానీ ద్వీపం విజయవాడ వద్ద కృష్ణా నది మధ్యలో ఉంది. ఇది ప్రకాశం బ్యారేజికి ఎగువన ఉంది. ఇది 133 ఎకరాల (54 హెక్టార్లు) విస్తీర్ణంతో భారతదేశంలో అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటి అని చెప్పవచ్చు. సహజ సిద్ధంగా ఏర్పడింది ఈ భవానీ ద్వీపం. దివంగత సీఎం ఎన్టీ రామారావు హయాంలో దీనిని గుర్తించి పర్యాటక స్థలంగా అభివృద్ధి చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ ఈ ద్వీపంలో వివిధ ఎమ్యూజ్‌మెంట్ పరికరాలు, సౌకర్యాలను మెరుగుపరిచి పర్యాటకులను ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వాలు కూడా భవానీ ద్వీపం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు హంగులు సమకూర్చాయి. ఇక్కడ సందర్శకులకు అవసరమైన సౌకర్యాలతోపాటు పిల్లల నుంచి పెద్దల వరకు ఆడుకొనేందుకు వివిధ రకాల ఆట పరికరాలు ఏర్పాటుచేశారు. సాహస క్రీడలు ప్రత్యేక ఆకర్షణ కాగా బోటింగ్ యువతను ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ దీని నిర్వహణ బాధ్యతలు చూస్తోంది.
అందుబాటులో బోట్లు, పడవలు..
పున్నమి ఘాట్ నుంచి ద్వీపానికి చేరేందుకు పర్యాటక శాఖ వివిధ రకాల బోట్లు, పడవలను అందుబాటులో ఉంచింది. కృష్ణనదిపై విహరిస్తూ దీవికి చేరుకోవడం పర్యాటకులకు మంచి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కాటేజీలు కూడా అందుబాటులో ఉంచడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పిల్లలకు బోలెడంత వినోదం కూడా లభిస్తుండడంతో స్థానికులు సైతం వీకెండ్స్‌లో ఇక్కడకు భారీగా వస్తున్నారు.
ద్వీపం పేరు, చరిత్ర
కనక దుర్గా దేవి ఆలయం దుర్గాదేవి యొక్క నివాసం. భవానీగా ఆమెకు మరో పేరు కూడా ఉంది, అందువల్ల ఈ ద్వీపాన్ని భవానీ ద్వీపం అని పిలుస్తారు. ఈ ద్వీపం ఆలయం సమీపంలో ఉంది.
భవానీ ద్వీపంలో పర్యాటక ఆకర్షణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు చేపట్టింది. శిలాపరం, ఒక కళలు, కళల గ్రామ పథకంతో డెవలప్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొండపల్లి బొమ్మల తయారదారులు, చేనేతకారుల వంటి స్థానిక కళాకారులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రిసార్ట్స్, గ్రామీణ మ్యూజియం, బర్మ్ పార్క్, తాడు-మార్గం లాంటి వాటితో పర్యాటకులకు ఆకర్షిస్తోంది ఈ భవానీ ద్వీపం.