Pawan Kalyan To Vijayawada: తనను అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ నిరసన, దిగొచ్చిన పోలీసులు - విజయవాడ వెళ్లేందుకు అనుమతి
Janasena Chief Pawan Kalyan : చజనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అనుమంచిపల్లి దగ్గర మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
Janasena Chief Pawan Kalyan stopped: ఏపీకి వస్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంతో పవన్ కళ్యాణ్ నిరసనకు దిగారు. ఓసారి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంతలోనే రోడ్డుపై పడుకుని పోలీసుల తీరును వ్యతిరేకించారు. మరోసారి నడుచుకుంటూ వెళ్తూ పవన్ చిత్ర విచిత్రంగా నిరసన తెలపడంతో పోలీసులు దిగొచ్చారు. మొదట పవన్ ను అదుపులోకి తీసుకోవాలని చూడగా, చివరికి ఆయనను విజయవాడ వెళ్లేందుకు అనుమతించారు. మూడు వాహనాలతో పవన్ విజయవాడకు బయలుదేరారు.
అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అనుమంచిపల్లి దగ్గర మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నడక ద్వారా మంగళగిరి చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. వాహనం దిగి జన సైనికులతో కలిసి నడుస్తున్నారు. పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది.
ఏపీ పోలీసుల రిక్వెస్ట్ మేరకు గన్నవరం వెళ్లాల్సిన పవన్ స్పెషల్ ఫ్లైట్ ను బేగంపేట ఎయిర్ పోర్టులో టేకాఫ్ నకు అనుమతించలేదు. ప్రత్యేక విమానంలో పవన్ ఏపీకి వెళ్లాల్సి ఉంది. అయితే బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అధికారులు షాకిచ్చారు. దాంతో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు పవన్ కల్యాణ్. కానీ పవన్ రాకను ముందే ఊహించిన ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీకి ఎంటర్ అయిన పవన్ వాహనాన్ని ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తనను పోలీసులు అడ్డుకోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగ్గయ్య పేటలో ఉద్రిక్తత..
ఏపీకి రావాలంటే పాస్ పోర్ట్, వీసాలు ఏమైనా కావాలా అంటూ పోలీసులపై పవన్ మండిపడ్డారు. జనసేనానిని అడ్డుకోవద్దంటూ జన సైనికులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పవన్ ను విమానంలో ఏపీకి రాకుండా ఎయిర్ పోర్టు అధికారుల సహకారంతో చివరి నిమిషంలో కృష్ణా జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రోడ్డు మార్గంలోనైనా సరే విజయవాడకు చేరుకుని ఆదివారం పార్టీ నేతలతో సమావేశం కావాలని భావించారు.
జగ్గయ్యపేట దాటిన తరవాత జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నిలిపివేసిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు.
— JanaSena Party (@JanaSenaParty) September 9, 2023
ఆందోళన చేస్తున్న జనసేన నాయకులు, శ్రేణులు pic.twitter.com/7zp0RSoKm2
పవన్ విజయవాడ వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గన్నవరం విమానాశ్రయ అధికారులకు మెయిల్ పంపారు. దాంతో టేకాఫ్ కు ముందే బేగంపేటలో పవన్ విమానానికి అనుమతి ఇవ్వలేదు. దాంతో పోలీసుల కళ్లుగప్పి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకుని కార్యక్రమాలలో పాల్గొనాలన్న పవన్ కు నిరాశే ఎదురైంది. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. జనసైనికులు, పోలీసులు పరస్పరం తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
జగ్గయ్యపేట దాటిన తరవాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు నిలిపివేయగా.. జనసేన నాయకులు, శ్రేణులు ఆందోళన చేస్తున్నారని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. పవన్ అడ్డుకున్న వీడియోను నాదెండ్ల మనోహర్ పోస్ట్ చేశారు.
విజయవాడలో అప్రమత్తమైన పోలీసులు..
పవన్ కళ్యాణ్ ఏ క్షణంలోనైనా ఏపీకి వస్తారని విజయవాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఏపీ పోలీసుల రిక్వెస్ట్ తో బేగంపేట ఎయిర్ పోర్టులో పవన్ ప్రత్యేక విమానానికి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతి లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఆదివారం పార్టీ మీటింగ్ ఉందని పవన్ విజయవాడకు వెళ్తున్నారని, కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా జనసేనాని రాకను అడ్డుకున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు.