Nara Lokesh: న్యూయార్క్ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న లోకేష్- కాలినడకన వెళ్లి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌తో భేటీ
Lokesh Padayatra In New York: వారం రోజులపాటు అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. కాలినడకన మీటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది.
Nara Lokesh America Tour: అమెరికాలో వారం రోజుల పాటు పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేష్ అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. టెస్లా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టబడులకు అవకాశం ఉన్న అవకాశాలను వారికి వివరించారు. వైజాగ్, అనంతపురం, అమరావతి లాంటి ప్రాంతాల్లో ఆయా సంస్థలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారీ పెట్టుబడులతో వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఆఖరి రోజు లోకేష్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. పర్యటనలో ముగింపులో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌కు కలవాల్సి ఉంది. అయితే న్యూయార్క్‌లో పూర్ణ ఆర్ సగ్గుర్తిని కలవడానికి వెళ్తున్నటైంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ముందుకు త్వరగా కదలడం లేదు. ఓవైపు ఆయన ఇచ్చిన టైమ్ దాటిపోతోంది. ఫైట్‌కి కూడా టైం అవుతంది.
అలా ట్రాఫిక్‌లో ఇబ్బంది పడ్డ నారా లోకేష్ కాదు దిగిపోయారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్‌ను కలిసేందుకు కాలినడకన బయల్దేరారు. న్యూయార్క్ నగరంలో నడుచుకుంటూ వెళ్లి పూర్ణను కలిశారు. ఈ వీడియోలను టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
న్యూయార్క్ లో ట్రాఫిక్ జామ్.....
— Mr Yash (@YashTDP_) November 2, 2024
తాను బస చేసిన హోటల్ సమీపంలో ఒక పారిశ్రామిక వేత్తను కలవాలి.... వాహనంలో కుదరదు....
కారు దిగి అక్కడే వదిలేసి కాలినడకన వెళ్లారు... ఆ పారిశ్రామిక వేత్తను కలవడానికి మంత్రి నారా లోకేష్.... @naralokesh @JaiTDP pic.twitter.com/kdhgEFw9mi
ఈ సమావేశం అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలను కూడా లోకేష్ కలిశారు. పరిశ్రమల రాక కోసం, పెట్టుబడులు ఆహ్వానించేందుకు అవసరమైన ఎకో సిస్టాన్ని చంద్రబాబు నేతృత్యంలోని ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికి వివరించారు. సరైన ప్రణాళికతో వచ్చే పారిశ్రామికవేత్తలకు వెంటనే అనుమతులు ఇస్తామని తెలిపారు. ఈ మధ్య తీసుకొచ్చి పాలసీలను వారికి వివరించారు.
పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలకు కావాల్సిన వసతులు కల్పంచేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కోస్తా ప్రాంతం, ఇతర వాతావరణ పరిస్థితులు, రోడ్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ గురించి వివరంగా చెప్పారు. ఏడాదిన్నరలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు లోకేష్. నాలుగు పోర్టులు కూడా రన్నింగ్ లోకి రానున్నాయని తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన మ్యాన్‌పవర్ సిద్ధంగా ఉందని అవసరం అయితే కావాల్సిన స్కిల్డ్ పీపుల్‌ను కూడా రెడీ చేస్తామన్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వాళ్లకు వివరించారు.
Also Read: యాపిల్ సంస్థకు లోకేష్ భారీ అఫర్- ఏపీలో కోరుకున్న చోట స్థలం ఇచ్చేందుకు అంగీకారం