(Source: ECI/ABP News/ABP Majha)
APPLE News: యాపిల్ సంస్థకు లోకేష్ భారీ అఫర్- ఏపీలో కోరుకున్న చోట స్థలం ఇచ్చేందుకు అంగీకారం
Lokesh Visit APPLE Office : అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ మరో ప్రతిష్టాత్మకమైన సంస్థను సందర్శించి పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు.
APPLE Unit In Andhra Pradesh:అమెరికాలో పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలోని యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ప్రియా బాలసుబ్రహ్మణ్యాన్ని కలిశారు. యాపిల్ యాక్టివిటీస్ విస్తరించడానికి ఏపీ అనుకూలమైన ప్రాంతంగా చెప్పుకొచ్చారు.
చాలా సమయం యాపిల్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ భారీ ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కోరిన చోట స్థలం ఇస్తామని తెలిపారు. తయారీ యూనిట్ స్టార్ట్ చేయాలని ఆహ్వానించారు. కావాల్సిన ప్రాంతంలో భూమితోపాటు కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి, ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ప్రియా బాలసుబ్రహ్మణ్యంని కలిశాను.
— Lokesh Nara (@naralokesh) October 29, 2024
భారతదేశంలో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ రావాలని ఆహ్వానించాను. సంస్థ కోరుకున్నచోట తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు…
ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా స్థలంతోపాటు మ్యాన్ పవర్ కూడా ఉందన్నారు నారా లోకేష్. అత్యంత నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉన్నాయని వాళ్లకు వివరించారు. అవసరమైతే మరింత ట్రైనింగ్ ఇచ్చి కావాల్సినట్టు తీర్చిదిద్దుతామన్నారు. నారా లోకేష్ ఆఫర్‌కు యాపిల్ ప్రతినిధులు కూడా ఇంప్రెస్ అయినట్టు సమాచారం. ఏపీతో కలిసి పని చేసేందుకు ప్రియా సుబ్రహ్మణ్యం సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.