Botsa Satyanarayana On Paper Leakage: ఇంటర్‌ పరీక్ష హాల్‌లో సీసీ కెమెరాలు- లీకులకు పాల్పడితే గుర్తింపు రద్దు చేస్తామన్న బొత్స

టెన్త్‌ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు. క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

FOLLOW US: 

టెన్త్‌పేపర్ల లీకేజీపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇప్పటి వరకు 69 మందిపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు. వీరిలో 36 మంది ప్రభుత్వం ఉపాధ్యాయులే ఉన్నారని తెలిపారు. దొరికిన వీరంతా పేపర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫొటోలు తీసుకుని బయటకు పంపారు. ఉయ్యూరులో జవాబులు తయారు చేస్తుండగా ఐదుగురు టీచర్లను పట్టుకున్నారు. ఆన్సర్లు తయారు చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. గతంలో లాగా డబ్బులు ఆశ చూపెట్టి ముందుగా లీకులు చేయటం లాంటిది జరగలేదన్నారు బొత్స. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. 

టెన్త్ పేపర్ లీకుల విషయంలో నారాయణ, చైతన్య, కేరళ ఇంగ్లీషు మీడియం స్కూల్ తదితర అక్రమాలకు పాల్పడిన వాటిపై తీసుకుంటామన్నారు బొత్స. అవసరమైతే ఆ స్కూళ్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామనని హెచ్చరించారు. పరీక్షలు అయిన తర్వాత రాజకీయాలు మాట్లాడదామన్నారు. లోకేష్ ఆరోపణలు చీప్‌గా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అతనికి పట్టదా?అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 

ఈ నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా పకడ్బందీగా జరుగుతాయన్నారు బొత్స సత్యనారాయణ.  దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశామని... అవసరమైతే రూములలో సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. 

Published at : 04 May 2022 08:52 PM (IST) Tags: ANDHRA PRADESH Inter Exams botsa satyanarayana SSC Exams

సంబంధిత కథనాలు

Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్

Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!

Lokesh On Ysrcp Govt :  తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్‌ - ఇండియా టాప్‌-10లో ఉన్నట్టే!

Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్‌ - ఇండియా టాప్‌-10లో ఉన్నట్టే!