Chandra Babu Got Bail: హైకోర్టులో చంద్రబాబుకు ఊరట- స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు
చంద్రబాబు వయసు, ఆరోగ్య సంబంధిత సమస్యలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌పై సోమవారం జరిగిన విచారణలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదించారు.
![Chandra Babu Got Bail: హైకోర్టులో చంద్రబాబుకు ఊరట- స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు AP High Court granted interim bail to TDP Chief Chandrababu Chandra Babu Got Bail: హైకోర్టులో చంద్రబాబుకు ఊరట- స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/aa593fe6f2eb5ad6116bcff062e03cc31698729967044215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TDP Chief Chandra Babu Got Interim Bail: స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టకేలకు స్వల్ప ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఆరోగ్యం దృష్ట్యా సుమారు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇస్తున్న హైకోర్టు తీర్పునిచ్చింది. నవంబర్ 24వ తేదీ దాకా ఈ మధ్యంతర బెయిల్ వర్తించనుంది. ఆ రోజు సాయంత్రం తిరిగి సరెండర్ అవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది బెయిల్ మాత్రమేనని, విచారణపై ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయనిపుణులు చెప్తున్నారు.
చంద్రబాబు వయసు, ఆరోగ్య సంబంధిత సమస్యలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌్పై సోమవారం జరిగిన విచారణలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదించారు. చంద్రబాబు కాటారాక్ట్ సమస్య గురించి ఇటీవల స్వల్ప వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు కాటారాక్ట్ ఆపరేషన్ చేయాలని టీడీపీ నాయకులు చెప్తుంటే, వెంటనే చేయాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్టు అధికారులు చెప్తూ వచ్చారు. విచారణలో భాగంగా వాదనలు విన్న హైకోర్టు... నవంబర్ 24 దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ వచ్చినందున ఈ సాయంత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టకేలకు స్వల్ప ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఆరోగ్యం దృష్ట్యా సుమారు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇస్తున్న హైకోర్టు తీర్పునిచ్చింది. నవంబర్ 24వ తేదీ దాకా ఈ మధ్యంతర బెయిల్ వర్తించనుంది. ఆ రోజు సాయంత్రం తిరిగి సరెండర్ అవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది బెయిల్ మాత్రమేనని, విచారణపై ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయనిపుణులు చెప్తున్నారు.
చంద్రబాబు వయసు, ఆరోగ్య సంబంధిత సమస్యలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌్పై సోమవారం జరిగిన విచారణలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదించారు. చంద్రబాబు కాటారాక్ట్ సమస్య గురించి ఇటీవల స్వల్ప వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు కాటారాక్ట్ ఆపరేషన్ చేయాలని టీడీపీ నాయకులు చెప్తుంటే, వెంటనే చేయాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్టు అధికారులు చెప్తూ వచ్చారు. విచారణలో భాగంగా వాదనలు విన్న హైకోర్టు... నవంబర్ 24 దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ వచ్చినందున ఈ సాయంత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్ వాదనలు వినిపించారు. చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ విజ్ఞప్తి పరిశీలించాలని కోరారు. కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారన్నారు.
చంద్రబాబు 50 రోజులకుపైగా జైలులో రిమాండ్‌లో ఉన్న అంశాన్ని న్యాయవాదులు వివరించారు. అనారోగ్య సమస్యలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు గతంలో ఒక కంటికి ఆపరేషన్ జరిగిందని..రెండో కంటికి ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పిన అంశాన్ని కోర్టుకు నివేదించారు. హైకోర్టుకు దసరా సెలవులకు ముందు పదే పదే బెయిల్ పిటిషన్లపై వాయిదాలు పడ్డాయి. తర్వాత విచారణ వాయిదా వేశారు. వెకేషన్ బెంచ్‌లో విచారణ జరిగినా న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పటంతో కేసు వాయిదా పడింది. ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత ఈ 50 రోజుల్లో కొత్తగా పురోగతి లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అదే సమయంలో కొత్తగా ఆరోపణలు కూడా లేవని వివరించారు. చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ తో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపులాయర్ సిద్ధార్థ లూధ్రా సిద్ధమయ్యారు. అయితే.. సీఐడీ తరపు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమకు సమయం కావాలని కోరారు. దీంతో వాదనలు ఎప్పుడు వినాలన్న అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు తరఫు లాయర్ల వాదనతో ఏకీభవిస్తూ తీర్పు వెల్లడించారు. ఇప్పటికే తనపై నమోదైన కేసుల్లో సెక్షన్ 17A వర్తిస్తుందని తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ పూర్తి అయింది. తీర్పు రిజర్వ్ అయింది. నవంబర్ ఎనిమిదో తేదీ లోపు తీర్పు వెలువడే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)