Bandar Port Works Stars : మచిలీపట్నం బందర్ పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
Bandar Port Works Stars : మచిలీపట్నంలో బంద్ పోర్టు నిర్మాణ పనులను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్ ఆవిష్కరించారు.

Bandar Port Works Stars : ఏపీ సీఎం జగన్ ఈరోజు మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు. ఏళ్ల నాటి కల ఎట్టకేలకు సాకారం అయింది. బందర్ పోర్టు నిర్మాణ పనులను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. సోమవారం ఉదయమే తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్ ఆవిష్కరించారు.
బందరు పోర్టు శంకుస్థాపన సందర్భంగా మచిలీపట్నంలో కోలాహలం నెలకొంది. భారీగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. వాళ్లను చూసిన ముఖ్యమంత్రి అభివాదం చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్ లోని భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ మచిలీపట్నం నుంచి బయలు దేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం. బహిరంగ సభ వద్ద దృశ్యాలు. pic.twitter.com/NEZX3Ho0G3
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 22, 2023





















