By: ABP Desam | Updated at : 25 Apr 2022 01:57 PM (IST)
సీఎం జగన్
2024లో మరోసారి అధికారం చేపట్టాలన్న ప్లాన్‌తో సీఎం జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మంత్రివర్గ విస్తరణతో ప్రభుత్వంలో ఎన్నికల టీం రెడీ చేసిన జగన్... ఇప్పుడు పార్టీపై ఫోకస్ పెట్టారు. అందుకు సరిపడా టీంను రెడీ చేసున్న ఆయన వారితో కాస్త టైం స్పెండ్ చేయాలని నిర్ణయానికి వచ్చారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీం ఎంపికలో కూడా చాలా పకడ్బంధీగా వర్కౌట్ చేశారు జగన్. మంత్రివర్గం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక వరకు అన్నింటిలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. గడిచి మూడేళ్లు కేవలం సీఎంగా అధికారిక కార్యకలాపాలకే పరిమితమైన జగన్... ఇకపై రాజకీయ పార్టీలు కూడా పెట్టనున్నారని సమాచారం. కొత్త మంత్రులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల మధ్య సమన్వయం సరిగా ఉంటేనే పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు జగన్.
అందుకే ప్రభుత్వంతోపాటు రాజకీయంపై కూడా దృష్టి రపెట్టారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. జిల్లా పార్టీలో కూడా ప్రక్షాళనకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నేతలు ఎలాంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలి... ప్రభుత్వ పథకాలను ముందుకెళా తీసుకెళ్లాలనే అంశంపై నేతలతో మాట్లాడనున్నారు.
మంత్రులు, నేతల మధ్య సమన్వయం కోసం ఈ నెల 27న కీలక సమావేశం నిర్వహించనున్నారు జగన్. ఈ భేటీకి కొత్త మంత్రులు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. రాబోయే 2024 ఎన్నికల ప్రక్రియ, జిల్లాల్లో పర్యటనలు గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలతోపాటుగా భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు. దీనికి తగ్గట్టుగా క్యాడర్‌ను సమాయత్తం చేయబోతున్నారు. వీటిపై తన నిర్ణయాలు కూడ వెల్లడించనున్నారు జగన్.
Balakrishna About NTR: ఎన్టీఆర్‌కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న
Kodali Nani : చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారు, పవన్ కల్యాణ్ పై కొడాలి నాని హాట్ కామెంట్స్
YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్
TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత