Alluri Jayanthi: తెలుగు జాతికి గర్వకారణం అల్లూరి, జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు రాలేదు: చంద్రబాబు
Alluri 125th Jayanthi: అల్లూరి జీవితమంతా పోరాటంతోనే గడిచిపోయిందని, బ్రిటీష్ వారితో పోరాడి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరుడు అని.. కానీ జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు రాలేదన్నారు చంద్రబాబు.
Chandrababu Pays Tribute to Alluri on his 125th Jayanthi: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమని, రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున మన్యం వీరుడికి నివాళులర్పించాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అల్లూరి జీవితమంతా పోరాటంతోనే గడిచిపోయిందని, బ్రిటీష్ వారితో పోరాడి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరుడు అని కొనియాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులను సమీకరించి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేసిన దీశాలి అల్లూరి అన్నారు. బ్రిటీష్ వారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్ లను ముట్టడించి, ఆయుధాలను స్వాధీనం చేసుకునేవారని.. సాయుధ పోరాటంతో బ్రిటీషర్లపై పోరాటంలో ముందుకు సాగుతూ తెలుగు వారికి స్ఫూర్తిగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు.
అల్లూరిని బంధించేందుకు రూ.40 లక్షల ఖర్చు
ఆ కాలంలోనే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును బంధించడానికి బ్రిటీష్ పాలకులు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ఆయనంటే ఆంగ్లేయులకు ఎంతో భయమే చెప్పడానికి ఇది నిదర్శనం. ఉభయ గోదావరి జిల్లాల్లో పోరాటం చేస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. కేవలం 27 సంవత్సరాల వయసులోపే బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆయనను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశారని చెప్పారు. ఆయన చేసిన పోరాటం శాశ్వతమని, కానీ జాతీయ స్థాయిలో ఆయనకు అనుకున్నంత గుర్తింపు రాలేదన్నారు. కేంద్రం 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని @narendramodi గారి చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం సంతోషకరం. తెలుగువారందరికీ గర్వకారణం. పార్లమెంటులోనూ అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి(1/2)#AlluriSitaRamaraju pic.twitter.com/WRbFyuBoXQ
— N Chandrababu Naidu (@ncbn) July 4, 2022
ప్రధాని రావడం సుముచితం..
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాష్ట్రానికి వచ్చి అల్లూరి త్యాగాల్ని కీర్తిస్తూ నివాళులర్పించడం సముచితం అన్నారు. టీడీపీ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తాను ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. పార్లమెంటులో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని గతంలో స్పీకర్ నిర్ణయించారు, దీన్ని ఆచరించి, ప్రజలు ఆయనకు ఘననివాళులర్పించాలని ఆకాంక్షించారు. తెలుగు వారితో పాటు దేశ ప్రజలు పోరాటంలో ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. నాయకుల పోరాట పటిమ, వారి త్యాగాల వల్ల స్వేచ్ఛా భారత దేశంలో ఉన్నామని పేర్కొన్నారు.
అమాయక గిరిజనం నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్ లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణం pic.twitter.com/8FGizKXh2Q
— Lokesh Nara (@naralokesh) July 4, 2022
గిరిజనుల్లో ధైర్యం నింపారు: నారా లోకేష్
అమాయక గిరిజనులు నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. స్వాతంత్య్ర సంత్రామంలో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణమని చెప్పారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం ఒక తెలుగువాడిగా సంతోషంగా ఉందన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆ విప్లవజ్యోతి సాహస చరిత్రను స్మరించుకుని స్ఫూర్తిని పొంది ముందుకు సాగుదామని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
Also Read: Raghurama Cancelled Bhimavaram Tour: ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో ఎంపీ రఘురామ పేరు లేదు: ఏలూరు డీఐజీ క్లారిటీ