అన్వేషించండి

Kesineni Nani: చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారు, కేశినేని నాని సంచలన ఆరోపణలు

Nani Comments On Chandrababu: చంద్రబాబుపై కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ టికెట్లు అమ్ముకుని డబ్బులు పొగు చేసుకుంటున్నారని ఆరోపించారు.

Vijayawada: టీడీపీ అధినేత చంద్రబాబుపై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.  రానున్న ఎన్నికల్లో తండ్రీకొడుకులిద్దరూ కలిసి టికెట్లు అమ్ముకుంటారని, వచ్చిన డబ్బుతో ఎన్నికల తర్వాత తెలంగాణకు వెళ్లిపోతారని ఆరోపించారు. ఎన్నికల పూర్తైన తర్వాత టీడీపీ ఆఫీస్‌కు తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని, చంద్రబాబు ఫ్యామిలీకి అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు కూడా లేదని అన్నారు.  చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు అని, ఆ తర్వాత తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడం ఖాయమని కేశినేని నాని జోస్యం చెప్పారు. సీఎం జగన్‌ను చూసి చంద్రబాబు, లోకేష్ బుద్ది తెచ్చుకోవాలని సూచించారు.

చంద్రబాబు, లోకేష్ సీట్లు అమ్ముకుంటున్నారు! 
సీఎం వైఎస్ జగన్ పేదలకు సీట్లు ఇస్తుంటే.. చంద్రబాబు, లోకేష్ కలిసి సీట్లు అమ్ముకుంటున్నారని కేశినేని నాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను చూసి ఇద్దరూ సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని, ఆయన మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అని, ఎవరూ ఆపలేరని నాని జోస్యం చెప్పారు. అయితే కేశినేని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన కామెంట్స్‌కు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నానిని టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేష్ గెంటేశారని, అందుకే ఇలా వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే కేశినేని భవన్‌కు వెళ్లి నానిని కొడతానంటూ బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. కేశినేని నానికి సంబంధించిన ఒక హోటల్‌లో జరిపే భాగోతం వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తానంటూ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

నానిపై బుద్ధా సంచలనం! 
గతంలో కూడా విజయవాడతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో గెస్ట్‌హౌస్‌లు నడుపుతూ నాని సెక్స్ రాకెట్ నిర్వహించారని బుద్దా వెంకన్న ఆరోపించారు.  నాని ఒక బ్రోకర్ అని, పండుగల సమయంలో బస్సు టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్న వ్యక్తి అని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా చిరంజీవి టికెట్లు అమ్ముకున్నారని నాని ఆరోపణలు చేశారని అన్నారు. చంద్రబాబు కర్ణుడు లాంటి వారని, ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదన్నారు. నాని నిజస్వరూపం తెలిసే ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించారని, ఇప్పుడు జగన్ వంచన చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ టికెట్లను అమ్ముకుంటున్నారని, ఒక్కొక్కరిని రూ.140 కోట్లు అడుగుతున్నారని ఆరోపించారు. నాని దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రెండుసార్లు చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చారని, టీడీపీ నేతలే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నానిని గెలపించారని బుద్దా వెంకన్న అన్నారు. 

కాగా, విజయవాడ ఎంపీ టికెట్‌ను నానికి కాదని ఆయన తమ్ముడు చిన్నికి చంద్రబాబు కేటాయించారు. దీంతో నాని టీడీపీలో ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉండగా.. ఇటీవల పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్నారు. నానికి జగన్ సైతం టికెట్ ఇంకా ఫిక్స్ చేయలేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Viral News: ఇద్దరు భర్తలు -  రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
ఇద్దరు భర్తలు - రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Embed widget