Vijayawada News : విజయవాడలో స్వాతంత్ర్య వేడుకలు, ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
Vijayawada News : విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర్య వేడుకల కారణంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Vijayawada News : ఏపీలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం అయ్యింది. రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆహ్వానితులు, పాస్‌లు ఉన్నవారు ఉదయం 8 గంటల కల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్ హోమ్) కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
అసెంబ్లీ, హైకోర్టులో కూడా ఏర్పాట్లు
సోమవారం ఉదయం 8 గంటలకు ఏపీ అసెంబ్లీతో పాటుగా కౌన్సిల్ లో స్వాతంత్ర దినోత్సవం నిర్వహించనున్నారు. కౌన్సిల్ లో మండలి ఛైర్మన్, అసెంబ్లీలో స్పీకర్ జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారు. సచివాలయం ప్రాంగణంలో సీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఏపీ హైకోర్టు ప్రాంగణంలో గౌరవ న్యాయమూర్తులు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొంటారు.
బెజవాడలో ట్రాఫిక్ మళ్లింపు
76వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వీవీఐపీలు, వీఐపీల రాకపోకలు కారణంగా బెజవాడలో ట్రాఫిక్ మళ్లింపునకు ఏర్పాట్లు చేశారు. 15వ తేదీ ఉదయం 07 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ను వివిధ మార్గాలలో మళ్లించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి కంట్రోల్ రూమ్ వైపు నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్లే అన్నీ వాహనాలను ఆర్.టి.సి. వై జంక్షన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా స్వర్ణ ప్యాలస్ , దీప్తి సెంటర్ పుష్పా హోటల్ , జమ్మిచెట్టు సెంటర్, సిద్ధార్థ జంక్షన్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపునకు మళ్లించినట్లు తెలిపారు.
ఆర్.టి.సి. వై జంక్షన్ నుంచి బందర్ లాకులు, రాఘవయ్య పార్క్, పాత ఫైర్ స్టేషన్ రోడ్, అమెరికన్ హాస్పిటల్, మసీద్ రోడ్ , నేతాజీ బ్రిడ్జ్, గీతానగర్, స్క్యూ బ్రిడ్జ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపునకు వాహనాలు మళ్లిస్తారు. బెంజ్ సర్కిల్ వైపు నుంచి బందర్ రోడ్డుకు వచ్చే వాహనాలను బెంజ్ సర్కిల్, నుంచి ఫకీర్ గూడెం– స్క్యూ బ్రిడ్జ్- నేతాజీ బ్రిడ్జ్- బస్టాండ్ వైపు వాహనాలు మళ్లిస్తారు. రెడ్ సర్కిల్ నుంచి ఆర్.టి.ఎ. జంక్షన్, శిఖామణి సెంటర్ నుండి వెటరినరీ , జంక్షన్ వరకు ఏ విధమైన వాహనాలు అనుమతించడంలేదు. బెంజ్ సర్కిల్ నుంచి డి.సి.పి. బంగ్లా కూడలి వరకు( యం. జి. రోడ్డులో) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు.
ఆర్టీసీ సిటీ బస్సులు మార్గాలు
1. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ “వై” జంక్షన్ నుండి బెంజ్ సర్కిల్ వైపు ఆర్టీసీ బస్సులు అనుమతించరు.
2. ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బందరు రోడ్డు రూట్ .నెం.5 లో వెళ్లే ఆర్.టి.సి. సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ వరకు వెళ్లి అక్కడ నుంచి బెంజ్ సర్కిల్ వైపునకు వెళ్లనున్నాయి.
ఆహ్వానితులకు సూచనలు
- “AA, A1, A2, B1, B2” పాసులు ఉన్న ఆహ్వానితుల కోసం వారి వాహనాలను ప్రత్యేకంగా పార్కింగ్ కల్పించారు.
1. ’’AA పాస్’’ ఉన్న వారు గేట్ నం. 3 (ఫుడ్ కోర్ట్) నుంచి ప్రవేశించి అక్కడే నిర్దేశించిన స్థలంలో వాహనాలు పార్కింగ్ చేయవలెను.
2. “A1, A2 ”పాస్ కలిగిన వారు గేట్ నం. 4 (మీ సేవ వద్ద ఉన్న) ద్వారా లోపలికి ప్రవేశించి వారి వాహనాలను హ్యాండ్ బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకోవాలి.
3. “B1, B2 పురస్కార గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు ” పాస్ కలిగిన వారు గేట్ నం. 2 ద్వారా ప్రవేశించి ఫుట్ బాల్ గ్రౌండ్ లో లేదా స్టేడియానికి
ఎదురుగా ఉన్న ఆర్మేడ్ రిజర్వు గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకోవాలి.
4. మీడియా, పాత్రికేయులు గేట్ నెం.2 ద్వారా స్టీడియమ్ లోపలికి అనుమతిస్తారు.
5. పాసులు ఉన్న ఆహ్వానితులు ఉదయం 7:45 నిముషాల లోపు స్టేడియం వద్దకు చేరుకోవాలి .
Also Read : Independence Day 2022: ప్రపంచంలో ఎత్తైన వంతెనపై జాతీయ జెండా, అద్భుతం అంటున్న నెటిజన్లు