అన్వేషించండి

Union Minister Murugan: ఆర్ధిక ప్రగతి సాధించేలా బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు - కేంద్ర మంత్రి మురుగన్‌

Union Minister Murugan: ఏపీ ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురగన్ తెలిపారు. 2024 - 25 బడ్జెట్​లో రూ. 50,474 కోట్లు కేటాయించామన్నారు.

Union Minister Murugan on Central Budget for AP: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురగన్  తెలిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా  శనివారం నాడు ఆయన‌ చిత్ర పటానికి కేంద్రమంత్రి మురుగున్ పూల‌మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర  బడ్జెట్ ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ ముందు చూపుకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శనమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించారన్నారు.  రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 టార్గెట్ గా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎకానమీ 8.2 శాతం ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ అనంతరం మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో విజయవాడ వచ్చిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.


అందరి చూపు ఏపీ పైనే
పరిశ్రమలు, ‌పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపే చేస్తారని మురుగన్ తెలిపారు. పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగం ,‌ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయన్నారు.  ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కేంద్రం సహకారం ఉంటుందన్నారు. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. కేంద్ర ఏపీకి అదనపు నిధులు కూడా భవిష్యత్తులో  అందజేస్తుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించారు.  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో సరళతరం, ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడం దిశగా తగిన నిర్ణయాలను బడ్జెట్‌లో తీసుకున్నట్లు మురుగున్ తెలిపారు.  

ఏపీ అభివృద్ధికి 2024 - 25 బడ్జెట్​లో దాదాపు రూ. 50,474 కోట్లు కేటాయించామన్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న  పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం పూర్తి సాయం అందిస్తుందన్నారు.   విశాఖ - చెన్నై, హైదరాబాద్ - బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్​లో ప్రాధాన్యం ఇచ్చారని అలాగే ప్రతిష్ఠాత్మక పూర్వోదయ స్కీంను తెచ్చామని, దీనివల్ల జార్ఖండ్ నుంచి ఏపీ వరకూ ఉన్న తూర్పు తీర ప్రాంతం అభివృద్ధికి గ్రోత్ ఇంజన్​గా మారుస్తామన్నారు.

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం
 వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు.  డిజిటల్ క్రాప్ సర్వే చేసి కిసాన్ క్రెడిట్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఏపీ నుంచి 60 శాతం  మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయన్నారు. తీర ప్రాంతాలను అభివృద్ధి చేసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించామన్నారు. చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా రుణాలు అందజేస్తామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు వంటి పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో నిలిచేలా ప్రోత్సహిస్తామన్నారు.  రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా వెనకబడిన ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని మంత్రి మురుగన్ తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget