AP News Developments Today: నేడు పీలేరు సబ్ జైలుకు చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలకు పరామర్శ
నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగంతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి.
📍 తిరుపతి: నేడు అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు.
📍 నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. సాయంత్రం 4 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం.. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగంతో ముగియనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
📍 ఢిల్లీ: ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం కానున్న బీజేపీ “ఆఫీస్ బేరర్లు”
📍 శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీస్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణం.. అమ్మవారిని ఆడపడుచుగా భావించి శ్రీస్వామి అమ్మవారికి కళ్యాణ వస్త్రాలు సమర్పించిన చెంచు గిరిజనులకు చెంచు గిరిజనులతో పాటు స్వామి అమ్మవారి కళ్యాణ వస్త్రాలు సమర్పించిన ఐటీడీఏ పి.ఓ రవీంద్రారెడ్డి
📍 నేడు కనుమ పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగన్నతోటలో ప్రభల ఉత్సవం..
📍 ఒంగోలు రంగారాయుడు చెరువులో ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం, హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి..
📍 ప్రకాశం : మర్రిపూడి మండలం గుండ్లసముద్రంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు..
📍 బాపట్ల : చీరాల మండలం ఈపురుపాలెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2కే రన్ కార్యక్రమం.
📍 ప్రకాశం : కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల ఫైనల్స్..
📍 నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు
📍 నెల్లూరు: కనుమ సందర్భంగా నెల్లూరు నగరంలోని బోడిగాడి తోటలో పెద్దల పండుగ
📍 తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో పార్వేటి ఉత్సవం, ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
📍 మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ -1 నిందితుడు ఏర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటేషన్ పై నేడు తీర్పు వెలువరించనున్న సుప్రీం కోర్టు.
📍 తిరుపతి: నేడు చంద్రగిరి నియోజక వర్గం ఏ.రంగంపేటలో జల్లికట్టు పోటీలు
📍 కర్నూలు: నేడు మంత్రాలయం మండలం రాంపురంలో శ్రీ రామలింగేశ్వరిస్వామి మహా రథోత్సవం..
📍 నేడు శ్రీశైలంలో ఐదో రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం కైలాసవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న స్వామి, అమ్మవారు.. రాత్రి శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం
📍 నేడు మహానందిలో కనుమ పండుగ సందర్భంగా పార్వేట ఉత్సవం, ముగ్గుల పోటీలు.. చిన్న చెరువు కట్టపై వినాయక ఘాట్ లో శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారికి తెప్పోత్సవం