అన్వేషించండి

Tomoto Rates : అందుబాటులోకి వచ్చిన టమాటా - కేజీ ఇంత తక్కువా !?

దేశవ్యాప్తంగా టామోటా రేట్లు దిగి వస్తున్నాయి. కేజీ రేటు యాభై కంటే తక్కువకు పడిపోయింది.,


Tomoto Rates :  వినియోగదారులను ఠారెత్తించి రైతుల పంట పండించిన టమోటా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌యార్డులో టమాటా ధరలు  తగ్గుముఖం పట్టాయి.- గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు దిగుబడి స్వల్పంగా పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం వరకు అత్యధికంగా కిలో టమాటా రూ.100 వరకు ఉంది. గురువారం ఈ ధరలు ఒక్కసారిగా తగ్గాయి.   ఏ గ్రేడ్ కిలో టమాటా రూ.50 నుంచి రూ.64 వరకు అమ్ముతున్నారు. తక్కువ  గ్రేడ్ టమాటాలు ఇంకా తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి.  

దేశంలో అన్ని మార్కెట్లకూ పెరిగిన టమాటాల రాక                          

ఒక్క ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా టమాటా ధరలు తగ్గు ముఖంపట్టాయి.  దేశ రాజధాని ఢిల్లీలోని మండీల్లో  కిలో రూ.యాభైకే అమ్ముకున్నారు.   గత వారం వరకు ఢిల్లీలో టమాట కిలో రూ.180 నుంచి 200 వరకు విక్రయించారు.  టమాటా ధర రూ.50తగ్గడంతో ఒక్కసారిగా మార్కెట్‌లో టమాట కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. టమాటా ధరలు తగ్గడానికి కారణం ప్రస్తుతం వర్షం తగ్గడమేనని భావిస్తున్నారు.   అందుకే హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రోజూ సరిపడా టమాటాలు సరఫరా అవుతున్నాయి. కర్నాటకలోనూ వర్షాలు ఆగిపోయాయి. దీంతో బెంగళూరు నుంచి కూడా టమాటా మండీలకు చేరుతోంది.  టమాట రాక రాను రాను పెరగడంతో రూ.5కి  తగ్గింది.  

కేజీకి యాభై కన్నా తక్కువకే టామోటల లభ్యత                
 
టమోటా ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో కేంద్రం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ ధరలకు టమోటా అమ్మకాలకు ప్రయత్నించారు. కానీ, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కౌంటర్లు సామాన్యులను ఏ మాత్రం సరిపోలేదు.వర్షాలు తగ్గటం, మార్కెట్ కు పెద్ద మొత్తంలో టమోటా రావటంతో ధరలు తగ్గు ముఖం పట్టాయి. హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచే అధికంగా టమాట వస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని జిల్లాల నుంచి కూడా టమాట ఎక్కువగానే వస్తోంది.
  
రైతులకు గోల్డెన్ డేస్ ముగిసినట్లే !                     

ఇటీవలి కాలంలో టమాటా ధరలు కొండెక్కడంతో.. రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కొందరు రైతులైతే ఎప్పడూ లేని స్థాయిలో టమాటా ధరలు పెరగడంతో కోటీశ్వరులు కూడా అయ్యారు. ఒకానొక సందర్భంలో రూ.1, రూ. 2లు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. కనీస పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తమ పంటను రోడ్డుమీదే పారబోయడం కూడా చూశాం. అలాంటిది ఈ సారి ఇంత ధర పలకడంతో రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ఈ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో మళ్లీ ఆందోళన మొదలైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Embed widget