అన్వేషించండి

Tomato Prices: వారం పదిరోజుల్లోనే టమాటా రైతు జీవితం తలకిందులు- ఇప్పుడు కేజీ రూ.10 లే

Tomato Prices: టామాటా పేరు ఎత్తితేనే ప్రజలు వణికిపోయారు. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమాటా కాస్ట్‌లీ కూరగాయ అయ్యింది. చూడడమే తప్ప కొనుగోలు చేయలేని స్థితికి టమాటా చేరుకుంది.

Tomato Prices: టామాటా పేరు ఎత్తితేనే ప్రజలు వణికిపోయారు. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమాటా కాస్ట్‌లీ కూరగాయ అయ్యింది. రెండున్నర నెలల పాటు చూడడమే తప్ప కొనుగోలు చేయలేని స్థితికి టమాటా చేరుకుంది. దేశం మొత్తం టమాటా రేట్లు రెండున్నర నెలల పాటు చుక్కలు చూపించాయి. కొంత మంది రైతులు, వ్యాపారులు నెలలోనే కోట్లకు పడగలెత్తారు. కొన్ని చోట్ల టమాటాల కోసం హత్యలు, దొంగతనాలు జరిగాయంటే రెండు నెలలు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలలు ఆకాశాన్నంటిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కిలో టమాటా 11కి చేరింది. ప్రజలు ఊపిరి పీల్చుకుంటుంటే రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌లో కిలో రూ.200 పలికిన టమాటా ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.24కి దొరుకుతోంది. ఏపీలో హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.218 పలుకగా, ఇప్పుడు కిలో రూ.11కి విక్రయిస్తున్నారు. జూన్ నుంచి టమాటా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. చాలా వరకు వంట గదుల్లో టమాటా కనిపించకుండా పోయింది. 

అదే సమయంలో టమాటా సాగు చేసిన రైతులు కోటీశ్వరులుగా మారారు. ధరలతో కొంతమంది టమాటాలను దొంగతనం చేశారు. రైతులను దోచుకోవడం, చంపడం కూడా జరిగాయి. కొంతమంది టమాటా రైతులు తమ పొలాలను రక్షించుకోవడానికి గార్డులను నియమించుకున్నారు. టామాటాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రైతులు జూన్ నెలలో పెద్ద ఎత్తున టమాటా నాటారు. ఈ క్రమంలో ఉల్లి, క్యాలీఫ్లవర్ వంటి పంటలను విస్మరించారు.  భారీ రాబడిని ఆశించి టమాటా సాగు చేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ధరలు పతనమవడంతో నష్టాల్లో కూరుకుపోయారు.

ఏప్రిల్‌లో టమాటా మొక్కలు నాటానని, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆగస్టు మొదటి వారం వరకు పంట రాలేదని ఓ రైతు వాపోయాడు. ‘ఈ వారం 20 టన్నులు పండించగా రూ. 2.2 లక్షలు వచ్చింది. ఆగస్టు మొదటి వారంలో పంట చేతికి వచ్చి ఉంటే రూ.30 లక్షల వరకు ఆదాయం వచ్చేది. నేను దురదృష్టవంతుడిని’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన టమాటా రైతు వాపోయారు. రాష్ట్రంలో చాలా మంది రైతుల పరిస్థితి ఇదే. పంట చేతికి వచ్చే సరికి ధరలు ఒక్కసారిగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మాత్రం ధరలు తగ్గడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిలో టమాటా రూ.200 పలికితే సామాన్యుడు ఏంతిని బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు.

త్వరలో టమాటా కేజీ రూ.6 కే
ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ మొత్తంలో పంట కోతకు సిద్ధంగా ఉంది. కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున టమాటా పంట చేతికి రానుండంతో ధర మరింత తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అదనపు ఉత్పత్తి ఉందని, ఎగుమతికి అవకాశం లేదని ఏపీ వ్యవసాయ సంఘం ప్రతినిధి రవి కుమార్ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగా విక్రయించాలని చూస్తున్నారని అన్నారు. టమాటా వేగంగా పాడువుతుందని, పంట కోత కోసిన ఐదు రోజులలోపు విక్రయించాల్సి ఉంటుందన్నారు. లేకపోతే టమాటాలు ఎందుకు పనికిరావని, మరో 10 రోజుల్లో టమాటా ధర కిలో రూ.6కు తగ్గే అవకాశం ఉందని, ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget