News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు

Chittoor Inter Student Death: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఇంటర్ విద్యార్థిని తల వెంట్రుకలు బావిలో దొరకడంతో టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారని తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

Chittoor Inter Student Bhavyasree Death:

చిత్తూరు: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మ‌ృతిపై ట్విస్టుల ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మొదట సాధారణ ఆత్మహత్యగా భావించారు, తరువాత హత్య అని కుటుంబం ఆరోపించింది. ఆపై ఇది ప్రేమ వేధింపులతో చనిపోయిందా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి.  పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అనే కోణంలోనూ విద్యార్థిని మృతి కేసు దర్యాప్తు చేపట్టారు. తాజాగా బావిలో 16 ఏళ్ల బాలిక తల వెంట్రుకలు దొరకడంతో టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారని సమాచారం.

విద్యార్థిని మృతికి ముందు ఏం జరిగిందంటే..? 
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం, కావూరివారిపల్లె పంచాయతీ, వేణుగోపాలపురానికి చెందిన బాలిక(16) పెనుమూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఏం జరిగిందో కానీ ఈ నెల 16వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి చుట్టుప్రక్కల ప్రాంతం అంతా గాలించారు. కానీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఈ నెల 19న వేణుగోపాలపురం సమీపంలోని ఓ పాత బావిలో యువతి మృతదేహం ఉన్నట్లు వినాయకుడి నిమజ్జనం చేసేందుకు వెళ్ళిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి యువతి మృతదేహాన్ని బయటకు తీయగా.. మిస్సింగ్ అయిన బాలికగా గుర్తించారు. శాంపుల్స్ సేకరించి వాటిని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ పంపి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. జట్టు కనిపించకపోవడంతో ఆమె తల శిరోముండం చేసినట్లుగా తల్లిదండ్రులు భావించారు. మైనర్ బాలిక ధరించిన లెగిన్స్ లేకపోవడం, నాలుక కొరికినట్లుగా ఆనవాళ్ళు ఉండడంతో అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని ఆరోపించారు. 

పోలీసుల వెర్షన్ ఇదీ..
ఇంటర్ విద్యార్ధిని (16) మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాంమని ఎస్సై అనిల్ కుమార్ చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం తల వెంట్రుకలు లభించాయని వాటిని సైతం తిరుపతిలోని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసులో పురోగతి ఉంటుదన్నారు పోలీసులు. మూడు, నాలుగు రోజులుగా మృతదేహం నీటిలో ఉన్న కారణంగా వెంట్రుకలు విడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్పారని పోలీసులు తెలిపారు. క్లూస్ కోసం మరోసారి చెక్ చేయగా ఆమె తల వెంట్రుకలు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఇద్దరు యువకులను అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అనే కోణంలోనూ ఆమె తల్లిదండ్రుల ఫోన్ కాల్స్ రికార్డ్ ను పరిశీలిస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ వివరించారు.

ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్న భవ్యశ్రీ బంధువులు 
ప్రేమ వివాదం కారణంగానే బాలిక ప్రాణాలు కోల్పోయిందని, ఇద్దరు ఆమెను ప్రేమించారని స్థానికంగా వదంతులు వ్యాప్తి చెందాయి. అమ్మాయి ప్రేమలో ఉన్న మాట నిజమేనని, కానీ ఎవరో అమాయకురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన తరువాత బావిలో పడేశారని భవ్యశ్రీ పెద్దనాన్న ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలిక పెద్దనాన్న ఆరోపిస్తున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Published at : 25 Sep 2023 10:26 PM (IST) Tags: Chittoor Crime News Telugu News Inter Student Chittoor Inter Student Death

ఇవి కూడా చూడండి

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclone Michaung Updates: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్, తిరుమలలో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం‌ - టూవీలర్స్ పై ఆంక్షలు

Cyclone Michaung Updates: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్, తిరుమలలో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం‌ - టూవీలర్స్ పై ఆంక్షలు

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

టాప్ స్టోరీస్

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
×