TTD Special Darshan Tokens: శ్రీవారి భక్తులకు డబుల్ బొనాంజా - ఇకపై టికెట్ బుక్ చేసుకున్న వాళ్లకు బంపర్ ఆఫర్!
TTD Special Darshan Tokens: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ టోకెన్లను ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతుంది.
TTD Special Darshan Tokens: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని జన్మలో ఒక్కసారైనా దర్శించాలని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన శ్రీనివాసుడు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్య మంగళ స్వరూప దర్శన భాగ్యం కోసం ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు వివిధ రూపాల్లో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేరుకున్న భక్తులకు వివిధ మార్గాల్లో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంది టీటీడీ.
మార్చి 27 ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో..
సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు టైం స్లాట్ విధానం ద్వారా దర్శనం కల్పిస్తే, మరికొందరికి ఆన్లైన్ విధానం ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవ టోకెన్లు, అంగ ప్రదక్షణ టోకెన్లు, సీనియర్ సిటీజన్ టోకెన్లను ప్రతి నెల భక్తులకు అందుబాటులో ఉంచుతుంది. దీంతో ముందుస్తుగా టోకెన్లు పొందిన భక్తులు సకాలంలో స్వామి వారి దర్శనం పొందే విధానం టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రతి నెల మాదిరిగానే ముందస్తుగా మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టోకెన్లు టీటీడీ జారీ చేస్తూ వస్తుంది. ముందస్తుగా ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని ఎటువంటి అసౌఖర్యాలకు లోను కాకుండా స్వామి వారి దర్శనం పొందే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ మాసంకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను ఈనెల 27వ తారీఖున టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. ఏప్రిల్ మాసానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను రోజు వారి ఇరవై ఐదు వేల చొప్పున మార్చి 27వ తారీఖున ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.
ఏప్రిల్ నుంచి తిరుపతికి వందేభారత్
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య ఈ రైలు నడపనున్నట్టు ఇదివరకు రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ రైలును వెంకటేశ్వర స్వామి భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి రానుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
త్వరలోనే ఈ ట్రైన్ ఈ రెండు సిటీల మధ్య దూసుళ్లనుంది. దీనికి సరైన ఏర్పాట్లు చేసుకోవాలని స్థానిక రైల్వే అధికారులకు ఉన్నతాధికారుల నుంచి సందేశం వచ్చింది. గురువారం రోజు రాత్రి అన్ని విభాగాలను ఆదింశించారట. వచ్చే నెల మొదటి వారంలోనే దీన్ని తిరుపతి, హైదరాబాద్ మధ్య నడపాలని భావిస్తున్నారని సమాచారం.
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దేవుని దర్శనాని కంటే ముందు ప్రయాణమే పెద్ద అగ్ని పరీక్షలా ఉంటుంది. టికెట్ బుకింగ్ నుంచే వారి సహనానికి పరీక్ష మొదలవుతుంది. ముందస్తు ప్రణాళిక లేకుంటే మాత్రం తిరుపతికి టికెట్ దొరకడం చాలా సమస్య అందుకే ఇప్పుడు వందేభారత్ రాకతో ఆ సమస్య తీరిపోనుందని నగరవాసులు అంచనా వేసుకుంటున్నారు. ప్రయాణికుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
అంటే ఏప్రిల్ నెలలో తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లాలనుకునే వాళ్లు టికెట్ బుకింగ్‌తోపాటు వందేభారత్ ప్రయాణం కూడా కలిసి రానుంది.