Geo Tagging: టీటీడీ సంచలన నిర్ణయం, దేశ వ్యాప్తంగా ఉన్న ఆస్తులకు జియో ట్యాగింగ్!
Geo Tagging: దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులకు జియో ట్యాగింగ్ చేయాలని బోర్డు నిర్ణయించింది. అంతే కాకుండా అన్యాక్రాంతమైన ఆస్తులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది.
Geo Tagging: ఆపద మొక్కులవాడు, సప్తగిరీసుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్న దివ్య ధామం తిరుమల పుణ్యక్షేత్రం.. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు కాబట్టే ముడుపుల రూపంలో శ్రీనివాసుడికి కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు. కోరిన కోర్కెల తీరగానే తీరగానే తమ తమ స్ధోమతకు తగ్గట్టుగా హుండీలో కానుకలు వేసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇలా నగదుతో పాటుగా బంగారు ఆభరణాలు, వెండి, మణులు మాణిక్యాలు పొదిగిన కోట్ల విలువ చేసే ఆభరణాలు సైతం స్వామి వారిమి కానుకగా సమర్పిస్తారు. అంతే కాకుండా స్వామి వారికి కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కూడా ఇస్తుంటారు. శ్రీనివాసుడిపై అపారమైన భక్తితో తమ ఆస్తులు సైతం విరాళంగా ఇస్తుంటారు భక్తులు. దీంతో దేశ వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల సాగు, భూమి, ఇళ్లూ, ప్లాట్స్ రూపంలో ఆస్తులు ఉన్నాయి వెంకటేశ్వరుడికి. ఈ ఆస్తులను పరిరక్షించుకోవాల్సిన భాధ్యత టీటీడీపై ఉంటుంది.
స్వామి వారి ఆస్తులను టీటీడీ ఎలా పరిరక్షిస్తుందంటే?
కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సమర్పించిన భూములను రెవెన్యూ శాఖతో సమన్వయంతో టీటీడీ అధికారులు నిర్వహణ భాధ్యత చూస్తుంటారు. పర్యవేక్షణ కష్టతరంగా మారిన భూములను టీటీడీ ప్రత్యేక పద్దతి ద్వారా పర్యవేక్షిస్తుంది. అందుకే భూముల పరిరక్షణలో భాగంగా స్థలాలను అద్దె ప్రతిపాదికన ఆక్షన్ విధానంలో కేటాయిస్తూ ఉంటారు అధికారులు. దాతలు ఇచ్చిన భూములు, భవనాలు, సాగు భూములను మూడు ఏళ్ళకు ఒకసారి వేలం వేస్తూ అధిక అద్దె చెల్లించే విధంగా భూమి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్తారు. ప్రభుత్వ రంగసంస్ధలకు, ధార్మిక సంస్థలకు సైతం ఆక్షన్ విధానంలోనే భూములను మూడేళ్ళకు లీజిక్ విధానం ద్వారా ఇస్తుంటారు.
ఇకపై తిరుమలేశుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు టిటిడి పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. టిటిడి స్వయం ప్రతిపత్తి కలిగిన ధార్మిక సంస్ధల కావడంతో అందుకు తగ్గట్టుగా దేవాదాయ శాఖ నిబంధనలు అనుగుణంగా భూముల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే భక్తులు కానుకగా అందించిన సాగు భూమి దాదాపు రెండు వేల ఎకరాలు ఉన్నట్లు టీటీడీ అంచనా వేసింది.. ఇక ఫ్లాట్స్, భవనాలు 29056843.88 స్వ్కాయర్ యర్డ్స్ ఉన్నట్లు గతంలో టిటిడి ఓ శ్వేత పత్రంను విడుదల చేసింది..
నిరార్ధక ఆస్తులను వేలం వేసిన టీటీడీ..!
నిరార్ధక ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా టీటీడీ గతంలోనూ శ్రీనివాసుడి ఆస్తులను వేలం వేసింది. టీటీడీ రెవెన్యూ రికార్డుల ఆధారం ప్రకారం 1974 నుండి 2014 వరకూ 129 ఆస్తులను టీటీడీ విక్రయించినట్లు రికార్డులు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు విలువ చేసే శ్రీనివాసుడి ఆస్తులు ఎలా కాపాడుకోవాలి..?? భక్తుల మనోభావాలు దెబ్బ తీయకుండా వ్యవహరించాలనే విషయంపై టీటీడీ ఓకమిటీని ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆస్తులను గుర్తించి వాటి పరిరక్షణకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేసే విధంగా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీనివాసుడి ఆస్తులు కొన్ని వందల ఎకరాలు ఉన్నట్లు టీటీడీ రెవెన్యూ అధికారులు అంటున్నారు. టీటీడీ ఆస్తులు ఇకపై విక్రయించరాదని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడంతో, పాలక మండలి తీర్మానం ప్రకారం ఓ కమిటీని ఏర్పాటు చేసి భూములు ఎక్కడ ఉన్నాయి, అన్యాక్రాంతంమైన భూములు గుర్తింపు, వాటి పరిరక్షణ దిశకు అవసరం అయ్యే చర్యలపై టిటిడి దృష్టి సారించింది.
అయితే ప్రస్తుతం 75 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు 7636 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో వ్యవసాయ భూములు 1226 ఎకారాలు కాగా, వ్యవసాయేతర భూముల 6409 ఎకారాల విస్త్రీర్ణంలో ఉంది. ఇక 535 ఆస్తులు ప్రస్తుతం టీటీడీ వినియోగంలో ఉండగా, 159 ఆస్తులను టీటీడీ ఇతరులకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏడాదికి నాలు కోట్ల పదిహేను లక్షల రూపాయలు టిటిడి ఆదాయం వస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉన్న టిటిడి ఆస్తులకు సంబంధించిన రికార్డులు లేక పోవడంతో అందుకు ఓ కమిటీ ద్వారా వాటిని గుర్తించింది. ఇలా జమ్మూ కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకూ టీటీడీకి ఉన్న ఆస్తుల వివరాల సేకరించి వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటుంది. గతంలో, భవిష్యత్తులో టీటీడీ ఆస్తుల గుర్తింపు సులభతంగా చేసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న టిటిడి ఆస్తులకు జియో ట్యాగింగ్, జియో పెన్సింగ్ విధానం ప్రక్రియను కొనసాగిస్తుంది. ఎవరైనా టీటీడీ ఆస్తులను ఆక్రమించినా సులభంగా గుర్తించి, వాటిని పరిరక్షించుకోవచ్చని భావిస్తుంది. ఇక జియో ట్యాగింగ్ విధానం ద్వారా ఆస్తులను రక్షించి వాటిని మూడేళ్ళ పాటు లీజుకు ఇచ్చి ఆదాయం చేసుకోవాలని భావిస్తోంది.