అన్వేషించండి

TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ

TTD Special Entry Darshan | భారీ డిమాండ్ వల్లే రూ.300 దర్శన టికెట్లు త్వరగా పూర్తవుతున్నాయని, ఆన్‌లైన్ వ్యవస్థలో ఎలాంటి లోపాల్లేవని టీటీడీ స్పష్టం చేస్తూ, పుకార్లను నమ్మవద్దని భక్తులను కోరింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తిరుమల దర్శన టికెట్లపై భక్తుల అనుమానాలకు టీటీడీ స్పష్టం చేసింది.
  • భారీ డిమాండ్, తక్కువ లభ్యతతో టికెట్లకు తీవ్ర పోటీ నెలకొంది.
  • అధునాతన సాంకేతికత, వర్చువల్ క్యూతో బుకింగ్‌లు సజావుగా సాగుతాయి.

TTD Special Entry Darshan Online Booking | తిరుపతి: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌పై భక్తుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మీకు వస్తున్న సందేహాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శనివారం నాడు క్లారిటీ ఇచ్చింది. భారీ డిమాండ్ కారణంగానే టికెట్ల బుకింగ్‌లో తీవ్ర పోటీ నెలకొంటోందని, అంతేకానీ ఆన్‌లైన్, వెబ్‌సైట్ బుకింత్ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. బుకింగ్ సమయంలో వచ్చే విపరీతమైన రద్దీని తట్టుకునేలా Google Cloud Platform (GCP), లాస్ట్ బ్యాలెన్సింగ్, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, హారిజంటల్ స్కేలింగ్ వంటి మోడ్రన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్ పోర్టల్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. టికెట్ల విడుదలకు ముందు ప్రత్యేకంగా టెక్నికల్ వార్ రూమ్ ఏర్పాటు చేసి అప్లికేషన్ పనితీరు, సెక్యూరిటీ, ట్రాన్సాక్షన్లను సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

అందుబాటులో ఉండే టికెట్లకు, భక్తుల నుంచి వచ్చే డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ఈ పోటీకి ప్రధాన కారణమని టీటీడీ అధికారులు తెలిపారు. ఉదాహరణకు ఒకేసారి సుమారు 6 లక్షల మంది యూజర్లు పోర్టల్‌లోకి ప్రవేశించి, కుటుంబంలో ఒక్కొక్కరు నలుగురి చొప్పున ప్రయత్నిస్తే దాదాపు 24 లక్షల టికెట్లకు డిమాండ్ వస్తుంది. కానీ అందుబాటులో ఉండేది కేవలం 2.69 లక్షల కోటా మాత్రమేనని గుర్తుంచుకోండి. అంటే డిమాండ్ దాదాపు 9 రెట్లు ఎక్కువగా ఉండటంతో, కొన్ని సెకన్లలోనే ఒకే స్లాట్ టికెట్ల బుకింగ్ పూర్తవుతాయని పేర్కొంది. సర్వర్లు క్రాష్ కాకుండా, పేమెంట్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వర్చువల్ క్యూ విధానాన్ని ఉపయోగిస్తున్నామని, దీనిని సాంకేతిక లోపంగా భావించకూడదని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

పేమెంట్ ఫెయిల్ అవ్వడం అనేది కేవలం టీటీడీ అప్లికేషన్‌పైనే కాకుండా బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లు, యూపీఐ (UPI) గెట్‌వేల పనితీరుపై సైతం ఆధారపడి ఉంటుందని గుర్తుచేసింది. శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయాల దర్శన కోటాలను కూడా ఇదే విధానంలో విడుదల చేస్తున్నామని తెలిపింది. అక్కడ రద్దీ తక్కువగా ఉండటం వల్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని స్పష్టం చేసింది. భక్తుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆంటి-బోట్ మెకానిజమ్స్, డేటాబేస్ పెర్ఫార్మెన్స్‌ను నిరంతరం నవీకరిస్తున్నామని తెలిపింది. కాబట్టి తిరుమల దర్శనాలకు టికెట్ దొరకనంత మాత్రాన ఆన్‌లైన్ వ్యవస్థ విఫలమైందని భావించవద్దని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులను కోరింది. 

Frequently Asked Questions

టీటీడీ ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయా?

లేదు, టీటీడీ ఆన్‌లైన్ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవు. భారీ డిమాండ్ కారణంగానే టికెట్ల బుకింగ్‌లో తీవ్ర పోటీ నెలకొంటోందని టీటీడీ స్పష్టం చేసింది.

తిరుమల దర్శన టికెట్లు త్వరగా అయిపోవడానికి కారణం ఏమిటి?

అందుబాటులో ఉండే టికెట్లకు, భక్తుల నుంచి వచ్చే డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ప్రధాన కారణం. డిమాండ్ దాదాపు 9 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్‌లో వర్చువల్ క్యూ విధానం ఎందుకు ఉపయోగిస్తున్నారు?

సర్వర్లు క్రాష్ కాకుండా, పేమెంట్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వర్చువల్ క్యూ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది సాంకేతిక లోపం కాదు.

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో పేమెంట్ ఫెయిల్యూర్‌లు ఎందుకు జరుగుతాయి?

పేమెంట్ ఫెయిల్యూర్‌లు కేవలం టీటీడీ అప్లికేషన్‌పైనే కాకుండా బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లు, యూపీఐ గెట్‌వేల పనితీరుపై కూడా ఆధారపడి ఉంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Adulterated Ghee Case: టీటీడీ నెయ్యి కల్తీ కేసు - రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
టీటీడీ నెయ్యి కల్తీ కేసు - రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
Tirumala Water Scarcity: తిరుమలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. అడుగంటుతున్న డ్యామ్‌లు.. 90 రోజులకు మాత్రమే నీటి నిల్వలు!
తిరుమలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. అడుగంటుతున్న డ్యామ్‌లు.. 90 రోజులకు మాత్రమే నీటి నిల్వలు!
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget