By: ABP Desam | Updated at : 20 Nov 2021 07:59 PM (IST)
తిరుమల వర్షాలపై వైవీ సుబ్బారెడ్డి ప్రకటన
నవంబరు 17 నుంచి 19 వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 ఏళ్లలో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భారీ వర్షాల వల్ల తిరుమలలో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయని తెలిపారు.
మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్డులో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టీటీడీ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలగించి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారని పేర్కొన్నారు. రెండవ ఘాట్ రోడ్డులో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయని... ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు.
Also Read: Anantapur Rains: కదిరిలో కూలిన భవనాలు.. ఆరుగురు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది
తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్‌ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయి. నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్తగా ఇతర ప్రాంతాలకు తరలించారు. శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడతో పాటు, రాంనగర్, వినాయక నగర్, జీఎంబీ క్వార్టర్స్, శ్రీనివాస విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నాయి. కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారని ప్రకటనలో తెలిపారు.
Also Read: Weather Update: ఇప్పటికే ముంచేసిన వాన.. ఇవాళ మళ్లీ భారీ నుంచి అతిభారీ వర్షాలు
వసతి, ఆహారం ఏర్పాటు
శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశాం. వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగింది. ఐటీ విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారరు. టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
Also Read: తిరుపతిలో వరద బీభత్సం... ప్రమాదకరంగా రాయలచెరువు కట్ట... అప్రమత్తంగా ఉండాలని అధికారుల దండోరా
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Chittoor Ganja Smuggling : చిత్తూరు జిల్లాలో గంజాయి మత్తు, పోలీసుల కళ్లు గప్పి జోరుగా రవాణా!
Weather Updates: ఏపీలో ఆ జిల్లాల్లో 4 రోజులు వర్షాలు, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Tirumala News : తిరుమల కొండపై మరోసారి ఏనుగుల గుంపు హల్ చల్
AP Inter Supply Exam Fee: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజులు చెల్లించారా, విద్యార్థులు ఎవరెంత కట్టాలో తెలుసా !
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!