Renigunta Airport: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన, దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ లైన్స్!
Tirupati Airport Telugu News| ఓ ఎయిర్ లైన్స్ అకస్మాత్తుగా విమాన సర్వీసును రద్దు చేసింది. ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోవడంతో రేణిగుంట విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.
![Renigunta Airport: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన, దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ లైన్స్! Tirupati News Passengers protest at Renigunta Airport after cancellation of flight Renigunta Airport: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన, దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ లైన్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/f940752e24d4f6162363e6c3f48af5481716210737311233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Passengers protest at Renigunta Airport | రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. స్టార్ ఎలియన్స్ సంస్థ తమ విమాన సర్వీసును అకస్మాత్తుగా రద్దు చేసింది. రేణిగుంటకు మధ్యాహ్నం 3.10 నిమిషాలకు వచ్చి తిరిగి 4.20 నిమిషాలకు గుల్బర్గాకు విమానం వెళ్తుంది. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేణిగుంట - గుల్బర్గా మధ్య నడిచే విమాన సర్వీసును స్టార్ ఏలియన్స్ సంస్థ రద్దు చేసింది.
మధ్యాహ్నం నుంచి వేచి ఉన్న ప్రయాణికులు అసహనంతో ఆందోళనకు దిగారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఎయిర్ లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులోనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దాంతో దిగి వచ్చిన ఎయిర్ లైన్స్ యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామని సిబ్బంది చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)