Tirumala Updates: శ్రీవారి భక్తుల మధ్య స్వల్పంగా తోపులాట, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల కోసం !
శ్రీవారి భక్తుల మధ్య స్వల్పంగా తోపులాట జరిటింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
- రేపు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్లు జారీ చేయనున్న టిటిడి..
- నేటి మధ్యాహ్నం నుండే టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు చేరుకున్న భక్తులు..
- అధిక సంఖ్యలో భక్తులు ఒకే ప్రాంతం వద్ద గుమికూడి ఉండడంతో తొక్కిసలాట..
- ఘటనాస్ధలానికి చేరుకుని భక్తులను క్రమబద్దీకరించిన టిటిడి విజిలెన్స్..
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద స్వల్పంగా భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. జనవరి 2వ తారీఖున వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పొందేందుకు తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. అయితే ఎటువంటి సమాచారం లేకుండా భక్తులను ఒక్కసారిగా క్యూలైన్స్ లోకి అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులు క్యూలైన్స్ లోకి ప్రవేశించడంతో తోక్కిసలాటకు దారి తీసింది.
భక్తులను క్యూలైన్స్ లోకి అనుమతించే సమయంలో ఘటన స్ధలం వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేక పోవడంతో భక్తులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించే సమయంలో భక్తులు ఫెన్సింగ్ లో పడి ఇరుక్కు పోయారు. సమాచారం అందుకున్న టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఘటన స్ధలంకు చేరుకుని భక్తులను క్రమబద్దీకరించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. క్యూలైన్స్ నిర్వహణలో అధికారుల వైఫల్యం కారణంగానే ఘటనకు కారణం అని తెలుస్తొంది.
దేశంలో ఉన్న అన్ని వైష్ణవ ఆలయాలలో ముక్కోటి ఏకాదశినాడు ఉత్తర ద్వారంలో ప్రవేశిస్తే తిరుమలలో మాత్రం వైకుంఠ ప్రదక్షణ చేస్తారు. ఉత్తర ద్వారంలో ఏకాదశినాడు ద్వారాలు తెరవగానే ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. కాని తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రం వైకుంఠ మార్గంలో ఏకాదశి రోజున ఉత్సవమూర్తులను తీసుకెళ్ళరు. తిరుమల శ్రీవారి ఆలయం, దేశంలో ఉన్న వైష్ణవ ఆలయాలకు మధ్య తేడా ఉండటం వల్ల కొన్ని మార్పులు చేశారు. వైష్ణవ ఆలయాలలో కొన్నింటిని ఆలయాన్ని నిర్మంచి తర్వాత మూలవిరాట్ను ప్రతిష్టిస్తారు. కానీ తిరుమల శ్రీవారు స్వయంభుగా వెలసిన 9 అడుగు నిలువెత్తు సాలిగ్రామశిల.. అందువల్ల ముందు మూలవిరాట్ వెలసిన తర్వాత కాలానుగునంగా చక్రవర్తులు, రాజులు, రారాజులు శ్రీవారి ఆలయాన్ని అంచెలంచెలుగా నిర్మించారు. ఇక్కడ ముందుగా తిరుమలేశుడే, ఆ తరువాతే ఆలయం నిర్మాణం జరిగింది. అందువల్ల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయలేదు. గర్భాలయానికి దగ్గరగా ఉన్న వైకుంఠ ప్రదక్షణ మార్గాన్ని వైకుంఠ ద్వారంగా ఏర్పాటు చేసుకున్నారు.
సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు మాత్రమే శ్రీనివాసుడు కొలువైన గర్భాలయం అనుకుని ఉన్న ప్రకారాలను చూడగలం. ఈ వైకుంఠ ద్వారంలో ప్రదక్షణ చేసే భక్తులు మనసునిండా స్వామి వారిని నింపుకుని, గోవింద గోవింద అంటు నామ స్మరణలు చేస్తుంటారు. అందుకే అన్ని పర్వదినాల కంటే ముక్కోటి ఏకాదశినాడు స్వామి వారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. క్షణకాలం స్వామి వారిని చుడటానికి రోజుల తరబడి క్యూలైల్లో వేచి ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా జనవరి 2,3వ తేదీన జరిగే స్వామి వారి ఏకాదశి, ద్వాదశికి తిరుమలను ముస్తాబు చేసింది. అయితే గత ఏడాది దేశంలోని మఠాధిపతులు, పీఠాధిపతులు అంగీకారంతో పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తూ వస్తుంది. అయితే ఈ పది రోజుల్లో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని, మోక్షమార్గమైన వైకుంఠ మార్గం నుంచి వెళ్లనున్నారు.