Tirumala Updates: నేడు శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన రద్దు చేసిన టీటీడీ, ఎందుకంటే
Tirumala Latest News: ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మరాధన సేవను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.
![Tirumala Updates: నేడు శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన రద్దు చేసిన టీటీడీ, ఎందుకంటే Tirumala: TTD Official cancels Ashtadala Pada Padmaradhana at Tirumala Temple DNN Tirumala Updates: నేడు శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన రద్దు చేసిన టీటీడీ, ఎందుకంటే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/8de2e82133fc240fa452a130927d1e581663638201116233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ashtadala Pada Padmaradhana: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మారాధన సేవను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం కారణంగా టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. సోమవారం 20-09-2022 రోజున 67,276 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 31,140 మంది తలనీలాలు సమర్పించగా, 5.71 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 24 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా, స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.
శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించిన తర్వాత స్వామి వారి మూలవిరాట్ కు పట్టు వస్త్రం కప్పి ఉదయం ఆరు గంటల నుండి 11 గంటల వరకూ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంను ఆగమోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకూ, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలు ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామగ్రీ, తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఆ సమయంలో స్వామి వారి మూలవిరాట్ ను వస్త్రంతో కప్పుతారు. శిద్ది అనంతరం నామకోపు, శ్రీచూర్ణం,కస్తూరి పసుపు, పచ్చాకజ, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితె సుంగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. స్వామి వారి మూలవిరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
అష్టదళపాద పద్మారాధన రద్దు
అనంతరం వి.ఐ.పి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులను ప్రోటోకాల్ దర్శనంకు అనుమతించిన తరువాత సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. ప్రతి మంగళవారం నాడు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" సేవను కోయల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా తాత్కాలికంగా రద్దు చేసింది టీటీడీ. అనంతరం శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు.
సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)