By: ABP Desam | Updated at : 12 Jan 2023 06:00 PM (IST)
టీటీడీ ఈవో ధర్మారెడ్డి
TTD EO Dharma Reddy: తిరుమల అద్దె గదుల ధరలు పెంచారని విమర్శలు వస్తున్నాయి. గదుల ధరల పెంపుపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీటీడీపై విమర్శలు, గదుల ధరల పెంపు ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల అద్దె గదుల ధరలు పెంచారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడం చాలా బాధాకరం అన్నారు.
తిరుమలలో 7500 గదులు ఉన్నాయని, వీటితో పాటు యాత్రికులు ఉచిత సముదాయాలు నాలుగు ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు సంబంధించిన ఉచితంగా ఉండటానికి లాకర్లు, బోజనం, స్నానపు గదులు ఉన్నాయి. రూ.50, రూ.100 అద్దె గదులు 5 వేల వరకు ఉన్నాయని చెప్పారు. గత 40 సంవత్సరాలుగా అదే అద్దె ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 116 కోట్లు తో ఆధునికీకరణ చేశాం. 50 రూపాయలు గది ప్రైవేట్ హోటల్ ధర 2వేలకు కేటాయిస్తారు. గిజర్ , రూమ్ క్లినింగ్, కరెంట్ బిల్లు అన్ని కలిపి ఖర్చు రూ. 250 అవుతుందన్నారు.
వీటి అద్దె పెరిగింది..
సామాన్య భక్తులకు కేటాయించే గదలు ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. 1230 గదులకు 1000 రూపాయల ఉంది. ఇవన్నీ నాన్ ఏసి గదులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు ఈ గదులను ఆన్ లైన్ కేటాయిస్తాం. పద్మావతి, ఎంఎబిసీ ప్రాంతంలో సౌకర్యాలు ఎక్కువగా ఉన్న గదుల అద్దె ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో వీఐపీలు అధికంగా వస్తారు. 1344 గదులలో నారాయణ గిరి, ఎస్వీ గెస్ట్ హౌస్ అద్దె పెంచామని క్లారిటీ ఇచ్చారు.
పద్మావతి ప్రాంతంలో ఉన్న విఐపీలకు కేటాయించే గదులను 8 కోట్ల వ్యాయంతో ఆధునీకరణ చేసినా టీటీడీ ఆదాయం కోసం గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. ఏసీ గదులగా ఏర్పాటు చేసి అన్నీ గదులకు సమానంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం అన్నారు. యాత్రికుల ఉచిత సముదాయం 5 కూడా త్వరలో నే సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్నామని చెప్పారు. టీటీడీపై చేస్తున్న విమర్శల్ని ఖండించారు. విమర్శలు చేసే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తిరుమలలో వచ్చి స్వయంగా పరిశీలించవచ్చు అన్నారు.
ఒక్కో గదికి 5 లక్షలు ఖర్చు చేశాం. కానీ పెరిగిన ధరల వల్ల టీటీడీకి ఆదాయం నామమాత్రమే. సామాన్య భక్తుల కోసం ఉచితంగా టీటీడీ అందిస్తున్న సౌకర్యాలకు నెలకి రూ.30 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులో కి వస్తుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ టీటీడీ నిర్ణయాలను విమర్శించడం సరైన విధానం కాదన్నారు. వైకుంఠ ఏకాదశి పది రోజుకు చేసి వ్యాపార కేంద్రంగా మార్చారని విమర్శలు చేయడం సబబు కాదన్నారు. దీనిపై చర్చకు సిద్దంగా ఉన్నాం, టీటీడీ మాజీ ఛైర్మన్ చర్చకు రావాలని ఆహ్వానించారు.
మఠాధిపతులు, పీఠాధిపతులతో చర్చించి సాంప్రదాయం ప్రకారం తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైష్ణవ సాంప్రదాయం కనుక 32 మంది పీఠాధిపతులు, అనేక మంది ప్రొపెసర్లు చెప్పిన తరువాతే పది రోజులు వైకుంఠ ద్వారం దర్శనం అమలు చేస్తున్నామన్నారు. కనీస అవగాహన లేకుండా ఇలా టీటీడీ పై మాట్లాడటం సబబు కాదన్నారు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి.
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
Tirumala News : జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.123 కోట్లు, యంత్రాలతో లడ్డూ తయారీ - ఈవో ధర్మారెడ్డి
Annamayya District Crime: విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు- అన్నమయ్య జిల్లాలో కలకలం
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు