News
News
X

Tirumala News: భక్తులతో కిటకిటలాడుతున్న ఏడు కొండలు, సర్వదర్శనానికి 35 గంటల సమయం!

Tirumala News: పెరటాసి మాసం కావడం, సెలవులు ఉండంతో తిరుమలలోని ఏడు కొండలకు భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోవడంతో సర్వ దర్శనానికి 35 నుంచి 40 గంటల సమయం పడుతోంది.  

FOLLOW US: 

Tirumala News: వరుస సెలవులు, పెరటాసి మాసం కావడంతో తిరుమల ఏడు కొండలు భక్తులతో కిటకిటలాడుతుంది. గత రెండు రోజులుగా అనూహ్య రీతిలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠం1, 2 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యాన వనంలోని షెడ్లు, క్యూలైన్లు సామాన్య భక్తులతో నిండిపోయాయి. ఎనిమిది కిలోమీటర్ల మేర భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనం దాదాపు ముప్పై ఐదు గంటల నుండి నలభై ఐదు గంటల వరకూ సమయం పడుతుంది. శిలాతోరణం వద్ద క్యూలైన్లలో‌ వేచి ఉన్న భక్తులకు టీటీడీ ఎటువంటి సౌకర్యం కల్పించలేదని, కనీసం పిల్లలకు పాలు, అన్న ప్రసాదం వితరణ చేయడం‌ లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం ఉదయం నుంచి పెరిగిన భక్తుల తాకిడి..

శ్రీ వేంకటేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన పెరటాసి మాసం(తిరుమల శనివారాలు) కావడంతో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. పెరటాసి మాసంలో శ్రీనివాసుడి దర్శనం పొందితే చేసిన పాపాలు తొలగి, శుభాలు కలుగుతాయని భక్తుల‌ ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే పెరటాసి మాసంలో పెరిమాళ్ దర్శనార్ధం భక్తజనం సప్త గిరులకు క్యూ కడుతారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్ల తరువాత తిరుమలలో జరిగిన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలకు భారీ స్ధాయిలో భక్తులు విచ్చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలోనే పెరటాసి మాసం రావడంతో బ్రహ్మోత్సవాలో ప్రివిలైజ్ దర్శనాలను టీటీడీ పాలక మండలి రద్దు చేసి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్య ఇస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేసింది. 

అయితే ఈ‌నెల 4, 5 తేదీల్లో సాధారణంగా కొనసాగిన భక్తుల రద్దీ‌ గురువారం ఉదయం 10 గంటల నుంచి అనూహ్యంగా పెరిగింది. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణ గిరిలోని షెడ్లు భక్తులతో‌ నిండి పోయిన శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 35 గంటల‌ నుంచి 40 గంటల సమయం పడుతుంది.

News Reels

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు..

భక్తుల రద్దీ దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు భక్తులకు అసౌఖర్యం కల్గకుండా ఏర్పాటు చేస్తున్నారు. అంతే‌ కాకుండా భక్తుల అనూహ్య రద్దీపై వివిధ విభాగాధిపతులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా క్యూలైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, తాగు నీరు, పాలు వంటి సౌఖర్యాలు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ ఏడు కొండలపై కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అవసరం అయ్యే ఏర్పాట్లపై అధికారులు నిమగ్నం అయ్యారు. భక్తుల సంఖ్య పెరగడంతో భక్తుల రద్దీ ప్రదేశాలైన అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిధి గృహాలు, వసతి భవనాలు, పీఏసీ-1, 2, 3, 4, 5 వద్ద పోలీసులు భధ్రత ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు. అయితే గంటకు 4500 మంది భక్తులకి మాత్రమే దర్శన భాగ్యం కల్పించే అవకాశం టీటీడీకి ఉండడంతో భక్తులు ఓపికగా స్వామి వారి దర్శనం పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.

Published at : 07 Oct 2022 01:27 PM (IST) Tags: Tirumala Tirupati Tirumana Rush Full of Devotees in Tirumala Tirumala Satagirulu Heavy Pilgrim Rush Sarva Darshan

సంబంధిత కథనాలు

Gold-Silver Price 1 December  2022: 54 వేల వైపు పరుగులు పెడుతున్న బంగారం- మీ ప్రాంతాల్లో రేటు తెలుసా?

Gold-Silver Price 1 December 2022: 54 వేల వైపు పరుగులు పెడుతున్న బంగారం- మీ ప్రాంతాల్లో రేటు తెలుసా?

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirupati: తగ్గేదేలే, ఛేజ్ చేసి ఎర్రచందనం కూలీలను పట్టుకున్న పోలీసులు - సినిమా సీన్ తరహాలో !

Tirupati: తగ్గేదేలే, ఛేజ్ చేసి ఎర్రచందనం కూలీలను పట్టుకున్న పోలీసులు - సినిమా సీన్ తరహాలో !

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

Tirupati News: గంజాయి రవాణా చేస్తున్న కానిస్టేబుల్, సినీ ఫక్కీలో పట్టుకున్న ఖాకీలు !

Tirupati News: గంజాయి రవాణా చేస్తున్న కానిస్టేబుల్, సినీ ఫక్కీలో పట్టుకున్న ఖాకీలు !

టాప్ స్టోరీస్

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?