By: ABP Desam | Updated at : 26 Dec 2022 08:27 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున 70,373 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 32,954 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 5.05 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 16 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 30 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. అటుతరువాత ఉదయం 8 గంటలకు విఐపి విరామ సమయంలో విఐపిలకు స్వామి వారి దర్శనం కల్పించిన అనంతరం 10 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతిర "సోమవారం" రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవమూర్తుల విగ్రహాలు పరిరక్షణలో భాగంగా టీటీడీ రద్దు చేసింది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.
రేపు శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు.
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలులను టీటీడీ రద్దు చేసింది. డిసెంబరు 27న ఉదయం 6 నుండి 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను టీటీడీ నిర్వహించనుంది. ఈ కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Atchannaidu Arrest : పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడు అరెస్టుకు డిమాండ్
Tarak Ratna Health Update : అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి, హెల్త్ బులెటిన్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!
Tarak Ratna Health Update: నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఎక్మోపై చికిత్స పొందుతున్న తారకరత్న!
Ratha Saptami Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు - సూర్యప్రభ వాహనంతో మొదలు!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?