By: ABP Desam | Updated at : 17 Mar 2022 06:18 PM (IST)
తిరుమల
ఏడుకొండల్లో కొలువై ఉన్న వేంకటేశ్వరుడు దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటూ ఉంటారు. స్వామి వారిపై భక్తి భావంతో వేల కిలో మీటర్లు నడుచుకుంటూ స్వామి సన్నిధికి చేరుకుంటారు. అయితే సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం,శ్రీవాణి ట్రస్టు, వివిధ రూపాల్లో విరాళాలు అందించిన దాతలు, ఆర్జిత సేవ టిక్కెట్లు, ఏపి టూరిజం, తెలంగాణ టూరిజం తరపున స్వామి వారిని దర్శించుకుని భక్తులు పునీతులు అవుతుంటారు.
షరతుల నిబంధనలు
ఇది అంతా కోవిడ్ ముందు వరకూ సాగింది. ప్రస్తుతం అందుకు భిన్నంగా టిటిడిలో పరిస్ధితులు మారాయి. కోవిడ్ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది టిటిడి.. ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం, పరిమిత సంఖ్యలోనే సర్వదర్శనం టోకెన్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలు, శ్రీవాణిట్రస్టు, వర్చువల్ ఆర్జిత సేవ టిక్కెట్ల కలిగిన భక్తులను మాత్రమే కొండకు అనుమతిస్తోంది టిటిడి.
సేవల పెంపు
కోవిడ్ ప్రభావం పూర్తి స్ధాయిలో తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్యలను క్రమేపి పెంచుతూ వస్తొంది టిటిడి. ఈ క్రమంలోనే ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై గత పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం
ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై టిటిడి పాలక మండలి తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు టిటిడి సిద్దం అవుతుంది. tirupatibalaji.ap.gov.in టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది.
మార్చి 20న ఆర్జిత సేవల టికెట్లు
ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తులను కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతించనుంది టిటిడి. ముఖ్యంగా సుప్రభాతం, తోమాల,అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తులు టిటిడి కేటాయించనుంది. ఈ సేవలను బుక్ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు గృహస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో గృహస్తులకు టికెట్ల కేటాయింపు జరుగుతుందని, టికెట్లు పొందిన భక్తుల జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా తెలియనుంది. ఆర్జిత సేవ టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుందని టిటిడి వెల్లడించింది.
కల్యాణోత్సవం,ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చనని తెలియజేసింది. ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్రదీపాలంకార సేవ, వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవలను టిటిడి రద్దు చేసింది.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుంచి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టిటిడి రద్దు చేసిన క్రమంలో భక్తులు గమనించి టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది టిటిడి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు తమ ఆరోగ్యం, అదే విధంగా టిటిడి ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాలని కోరింది.
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక
Chittoor News : రూ. ఐదు నాణెం మింగేసిన బాలుడు, తల్లిదండ్రులకు వైద్యుల నిర్లక్ష్య సలహా!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!