అన్వేషించండి

Tirupati Mokkulu: వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో

శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు భక్తులు అనేక మొక్కులు మొక్కుతుండడం సహజమే. కొందరు కాలినడకన ఏడు కొండలు ఎక్కి దర్శించుకుంటానని అనుకుంటారు.

Tirumala Steps Way: కొండంత భక్తిని కష్టం లేకుండా ఎలా చేస్తున్నారో చూడండి.. ఏ శ్రమా లేకుండా కనీసం నడుం వంచకుండా ఇలా కూడా తమ భక్తిని చాటుకోవచ్చని తెలియచేస్తున్నారు ఈ అపూర్వ సహోదరులు. శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు భక్తులు అనేక మొక్కులు మొక్కుతుండడం సహజమే. కొందరు కాలినడకన ఏడు కొండలు ఎక్కి దర్శించుకుంటానని అనుకుంటారు. ఇంకొందరు ఆ మెట్లకు పసుపు రాస్తానని, మరికొందరు ప్రతి మెట్టుపై దీపం వెలిగిస్తానని ఇలా రకరకాలుగా మొక్కుకుంటారు. వారు అనుకున్న ప్రకారం కోరికలు తీరితే.. ముందుగా మొక్కుకున్న ప్రకారం.. ఎంత శ్రమ అయినా వెనక అడుగు వేయకుండా భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు.

చాలా మంది భక్తులు మొక్కులతో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అందులో ప్రధానంగా కాలినడకన వస్తుంటారు. అందుకోసం భక్తులకు అలిపిరి అలాగే శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులో ఉంటుంది. ఈ రెండు మెట్టు మార్గాల్లో నడిచి వచ్చే భక్తులు రకరకాల మొక్కులతో కాలి నడకను ప్రారంభిస్తారు. ఒకరు మోకాలితో నడిస్తే మరొకరు పొర్లు దండలు చేస్తూ పైకి చేరుకుంటారు. ఇంకొకరు మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ వ్రాసుకుంటు కర్పూరం వెలిగించుకుంటు వెళ్తారు. 

కానీ, ఇలా ఈ అపూర్వ సహోదరులు మెట్టు మెట్టుకు కర్పూరాన్ని వెలిగించుకుంటు వెళ్తున్న విధానాన్ని చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు కొందరు భక్తులు.  ఓ గరాటుకు అమర్చిన పైపు ద్వారా, ఒంగకుండానే ఒకరు కర్పూరాన్ని మెట్టుపై ఉంచుతుండగా, ఇంకో వ్యక్తి మాత్రం పొడుగాటి కర్రకు మంట వెలిగించి ఆ కర్పూరాలను అంటించుకుంటూ వెళ్తున్నాడు. 

కొందరు భక్తులు ఈ ఐడియా బాగానే ఉందని మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం కష్టపడి చెల్లించే మొక్కుబడిని కూడా వారి అవసరానికి, సుఖానికి కష్టం లేకుండా చెల్లించే స్థాయికి భక్తుల ఆలోచలు వచ్చాయి అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా వీరి ఇద్దరికి సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీవారి సేవలో కంగనా రనౌత్

తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ సినీ కథానాయకి కంగనా రనౌత్ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులు కోసం తిరుమలకు వచ్చామని తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget