News
News
వీడియోలు ఆటలు
X

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

TTD Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మే 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది.

FOLLOW US: 
Share:

Tirumala Special Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మే 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మే 24న విడుదల చేయనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు దర్శన టికెట్లు ఆన్ లైన్ లో విడుదల కానున్నాయి. తమ అధికారిక వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in లో భక్తులు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించారు.

వేసవి సెలవులు కావడంతో తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను సైతం టిటిడి రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా తిరుమలకు వస్తేనే విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తాంమని ప్రకటించింది. ఐతే సామాన్య భక్తుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

కలియుగ వైకుంఠనాధుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతి నిత్యం దేశ విదేశాల నుండి భక్తులు తిరుమల పుణ్యక్షేత్రంకు వస్తుంటారు.. ఇలా వచ్చిన భక్తులకు టిటిడి విఐపి బ్రేక్, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షణ, వయోవృద్దులు, దాతలు, సర్వదర్శనం టైం స్లాట్, దివ్యదర్శనం వంటి వివిధ పద్దతుల ద్వారా టిటిడి స్వామి వారి దర్శనం కల్పిస్తూ ఉంటుంది. సామాన్య భక్తుల మొదలుకుని బడా రాజకీయ నాయకులు, బడా పారిశ్రామిక వేత్తల వరకూ శ్రీనివాసుడి క్షణకాలం పాటు జరిగే దివ్య మంగళ స్వరూపం కోసం పరితపించి పోతుంటారు. అయితే సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రతి నెల ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టిటిడి అధికారిక వెబ్‌సైట్ లో టిటిడి విడుదల చేస్తుంటుంది.

ముందస్తుగా టోకెన్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా సులభంగా స్వామి వారి దర్శనం చేసుకునే వెలుబాటు కల్పిస్తూ ఉంటుంది టిటిడి. ప్రతి నెల మాదిరిగానే సుదూర ప్రాంతాల భక్తులు, గ్రామీణ ప్రాంతాల భక్తుక సౌఖర్యార్ధం ఈ నెల 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టిటిడి విడుదల చేయనుంది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో అధిక రద్దీ నేపధ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టిటిడి కుదించి ప్రతి రోజు 12 వేల టోకెన్ల చొప్పున నెలకు మూడు లక్షల అరవై వేల టోకెన్లను టిటిడి విడుదల చేయనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన జూలై, ఆగస్టు నెలల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్‌సైట్‌ లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది. నకిలీ వెబ్ సైట్ లను ఆశ్రయించి మోస పోవద్దని టిటిడి భక్తులను విజ్ఞప్తి చేస్తుంది..

Published at : 20 May 2023 04:53 PM (IST) Tags: AP News TTD Telugu News Tirumala Tirupati

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!