By: ABP Desam | Updated at : 10 Jan 2023 10:26 AM (IST)
Edited By: jyothi
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Tirumala Hundi Income: తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. సోమవారం రోజున అంటే జనవరి 9వ తేదీ 2023 ఒక్కరోజే 56 వేల 3 మంది స్వామి వారి దర్శించుకున్నారు. స్వామి వారికి 20 వేల 365 మంది తలనీలాలు సమర్పించగా, 3.89 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు.
పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేంకటేశ్వరుడికి అర్చకులు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాన్ని తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి రచించిన పాసురాళ్లను జియ్యంగార్లు పఠించి స్వామి వారిని మేలు కొల్పారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్బార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
ప్రతీ మంగళవారం అష్టదళపాద పద్మరాధన
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షిణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవమూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు.
సాయంకాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం జరిపిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Kadapa Crime : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్, బ్యాంక్ అకౌంట్లలో కోటికి పైగా నగదు చోరీ
వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
Tirumala News : జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.123 కోట్లు, యంత్రాలతో లడ్డూ తయారీ - ఈవో ధర్మారెడ్డి
Annamayya District Crime: విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు- అన్నమయ్య జిల్లాలో కలకలం
Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల కీలక ప్రకటన !
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్