అన్వేషించండి

Tirumala Laddu Row: నాల్గో రోజు లడ్డూ తయారీ కేంద్రంలో సిట్ విచారణ-ఏం పరిశీలించారంటే?

Tirupati News:లడ్డూ వివాదంపై నాల్గో రోజు విచారిస్తున్న సిట్ అధికారులు ఇవాళ బూందీపోటును పరిశీలించారు. అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు.

Tirumala News: తిరుమల లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తు నాల్గో రోజుకు చేరుకుంది. ఉదయాన్నే తిరులమ చేరుకున్న విచారణ అధికారులు లడ్డూ తయారీ కేంద్రాన్ని సందర్సించారు. అక్కడ సిబ్బందిని విచారించారు. లడ్డూ తయారీ విధానం గురించి తెలుసుకున్నారు. 

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని ఏర్పాటైన ఈ సిట్ మూడు రోజులుగా తిరుమలలోనే ఉంటూ దర్యాప్తు సాగిస్తోంది. మూడో రోజు దర్యాప్తులో భాగంగా టీటీడీ గోదాములు, పిండిమర, ల్యాబ్‌లను అధికారులు పరిశీలించారు. మూడో రోజు టైం లేకపోవడంతో నాల్గోరోజు లడ్డూ పోటులో విచారణ ప్రారంభించారు. 

ఉదయాన్నే లడ్డూ తయారీ కేంద్రానికి చేరుకున్న సిట్ సిబ్బంది అక్కడి సిబ్బందిని విచారించారు. బూంది పోటుకి వెళ్లి లడ్డు ఎలా తయారు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పరిశీలనా విధానాన్ని దగ్గరుండి గమనించారు.

అనంతరం నెయ్యిని నిల్వ చేసే ట్యాంకర్‌లనూ సిట్‌ సిబ్బంది పరిశీలించారు. నెయ్యిని ఎలా వాడుతున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని బృందం టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్‌లనూ దర్యాప్తు చేపట్టింది. గోడౌన్‌లనూ క్షణ్ణంగా పరిశీలించింది. అన్ని కోణాల్లోనూ విచారించి తర్వాత వివరాలు వెల్లడిస్తామంటున్నారు సిట్  బృందం . 

శనివారం నాడు తిరుపతికి వచ్చిన సిట్ అధికారులు పద్మావతి గెస్ట్ హౌస్‌లో దిగారు. అక్కడి నుంచి నేరుగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేశారు. సిబ్బందిని విచారించారు. కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత, పదార్థాల నాణ్యత, ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత పరీక్ష మెషీన్లు, టెక్నికల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్‌లో 9 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో చాలా మంది గతంలో తిరుమల తిరుపతిలో పని చేసిన అధికారులే. ఇప్పటికి నాలుగు రోజులుగా పర్యటిస్తున్న సిట్ ఇంకా ఎన్ని రోజుల పాటు పర్యటిస్తుందో తెలియదు. మరికొన్ని కీలకమైన విషయాలు రాబట్టాలని సిట్ చెబుతోంది. దీంతో మరికొన్ని రోజులు ఇక్కడ విచారణ కొనసాగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు బృందాలుగా విడిపోయిన సిట్‌ వివిధ అంశాలపై ఆరా తీస్తోంది. 

ఇప్పటి వరకు విచారణ చేసిన సిట్‌ గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు వివరాలు తీసుకుంది. నెయ్యి టెండర్లు వేసిన వ్యక్తులు ఎవరు? క్వాలిటీ ఏంటీ? వారు ఇచ్చిన రిపోర్టుల్లో ఏముంది? ఎంత ధరకు కోట్ చేశారు. వాస్తవ ధర ఎంత, నాణ్యత సంగతి ఏంటీ ఇలా కీలకమైన విషయాలపై టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళి కృష్ణను సిట్ బృందం ప్రశ్నించింది. తక్కువ ధరకు వస్తున్నా నాణ్యత సంగతి ఎందుకు ప్రశ్నించలేదని ఆరా తీశారు. ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడటం లేదని కూడా దర్యాప్తు చేస్తున్నారు. క్వాలిటీ లేదని తెలిసి ఎందుకు ప్రశ్నించలేదని... కనీసం రికార్డులో ఎందుకు ఎంటర్‌ చేయలేదని అధికారులను గ్రిల్ చేస్తున్నారు. 

Also Read: తిరుమల గిరుల్లో 66 కోట్ల తీర్థాలు.. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ స్నానమాచరిస్తే జ్ఞానం, వైరాగ్యం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget