అన్వేషించండి

Banakacherla Project: రాయలసీమకు జీవనాడి, ఏపీకి జల భద్రత: బనకచర్ల ప్రాజెక్టుతో మారనున్న భవితవ్యం!

Banakacherla Project: పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు అనేది గోదావరి-కృష్ణా-పెన్న నదులను అనుసంధానించే ప్రణాళిక. గోదావరి నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడం ముఖ్య లక్ష్యం.

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జల భద్రతను ఇచ్చే కవచంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణిస్తుంటే, తెలంగాణకు ఈ ప్రాజెక్టు శాపమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తుంది? ప్రయోజనాలు ఏంటి? అన్న అంశాలను పరిశీలిద్దాం.

ఏపీకి వరప్రదాయిని బనకచర్ల ప్రాజెక్టు

గోదావరి నదిలో వృథాగా కలుస్తున్న 3 వేల టీఎంసీల వరద కలుస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ మూడు వేల టీఎంసీలలో 200 టీఎంసీల వరద నీటిని కరవు పీడిత ప్రాంతం రాయలసీమతోపాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించడం ప్రాజెక్టు లక్ష్యం. ఇది కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంతోపాటు ఏపీకి తాగునీటి కొరత తీర్చేందుకు ఉద్దేశించి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దాదాపు 80 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయ పరంగా చూస్తే సుమారు 7.5 లక్షల నుండి 12 లక్షల ఎకరాల వరకు కొత్తగా సాగు నీరు అందించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది రాయలసీమకు వరప్రదాయినిగా చెప్పవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు ఈ ప్రాంతంలో గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న 22.59 లక్షల ఎకరాల ఆయకట్టును సాగునీటిని స్థిరీకరించవచ్చు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు, నాగార్జునసాగర్ కుడి కాలువ కింద 8 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణకు ఈ బనకచర్ల ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. ఇది పారిశ్రామిక అవసరాలను తీర్చే ప్రాజెక్టు కూడా. కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు ఇది దోహదం చేస్తుంది.

బనకచర్ల ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయంటే?

సెంట్రల్ వాటర్ కమిషన్‌కు బనకచర్ల ప్రాజెక్టుపై "ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR)" ను ఏపీ ప్రభుత్వం 2025, మే 22న సమర్పించింది. దీనిపై కేంద్ర జల సంఘం దృష్టి సారించింది. దీనిపై డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR)ను సమర్పించడానికి ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు ఈ ప్రాజెక్టుకు కీలకమైనవి. ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ నిపుణుల అంచనా కమిటీ (EAC) జూన్ 17, 2025న సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం - పర్యావరణ ప్రభావంపై ప్రాధమికంగా చర్చించింది. ఈ ప్రాజెక్టుకు Terms of Reference (ToR) మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అంతే కాకుండా, ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం జలహారతి కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

నదుల అనుసంధానంలో బృహత్తర ప్రాజెక్టు బనకచర్ల

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు అనేది గోదావరి-కృష్ణా-పెన్న నదులను అనుసంధానం చేసే ప్రణాళిక. గోదావరి నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడం ముఖ్య లక్ష్యం. మూడు దశలుగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పోలవరం నుండి కృష్ణా నది వరకు తొలి దశగా, కృష్ణా నది నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ వరకు రెండో దశగా, బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు మూడో దశగా నిర్మాణాన్ని చేపట్టేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇలా గోదావరి వరద జలాలను గోదావరి బేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు తరలించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో వినియోగించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే మెగా ప్రాజెక్టు బనకచర్ల

బనకచర్ల కరువు పీడిత రాయలసీమకు పునరుజ్జీవం కల్పించే ప్రాజెక్టు. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో జలవనరులు మరింత పెరుగుతాయి. తద్వారా కలిగే నీటి సమృద్ధి వల్ల వ్యవసాయ రంగంలో ఏపీ విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించే వీలుంటుంది. ఏపీ స్థూల దేశీయోత్పత్తి (GSDP) పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. వలసలు తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వ్యవసాయ రంగానికి మాత్రమే కాకుండా పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు నీటిని వినియోగించనున్నారు. తద్వారా పారిశ్రామిక రంగం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. మొత్తం మీద ఏపీ సమగ్రాభివృద్ధికి బనకచర్ల ప్రాజెక్టు కీలకం అని చెప్పాలి.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Daily Puja Tips: పూజలో ఏ వస్తువులను మళ్ళీ మళ్లీ ఉపయోగించవచ్చు? ఏవి ఉపయోగించకూడదు?
పూజలో ఏ వస్తువులను మళ్ళీ మళ్లీ ఉపయోగించవచ్చు? ఏవి ఉపయోగించకూడదు?
Embed widget