అన్వేషించండి

Raptadu MLA controversy: వైసీపీ ఎమ్మెల్యేపై బెంగాల్‌ ఎంపీ ఫిర్యాదు- రాష్ట్రవాసులను బంధించారని కలెక్టర్‌కు మెయిల్- సంబంధం లేదన్న తోపుదుర్తి

Raptadu MLA Topudurthi Prakash Reddy controversy : మరో వివాదంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఏకంగా బెంగాల్ పౌరులను బంధించారని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు బెంగాల్ ఎంపీ ఫిర్యాదు.

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారని ఏకంగా ఎస్పీ, కలెక్టర్లకే ఫిర్యాదు అందింది. పశ్చిమ బెంగాల్ ఎంపీ స్వయంగా జిల్లా యంత్రాంగానికి మెయిల్ చేశారు.
Raptadu MLA controversy: వైసీపీ ఎమ్మెల్యేపై బెంగాల్‌ ఎంపీ ఫిర్యాదు- రాష్ట్రవాసులను బంధించారని కలెక్టర్‌కు మెయిల్- సంబంధం లేదన్న తోపుదుర్తి

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తిపై ఫిర్యాదు రావడంతో ఒక్కసారిగా జిల్లాయంత్రాంగం అప్రమత్తమైంది. ఇంతకీ పశ్చిమబెంగాల్‌ ఎంపీ ఏహెచ్‌ ఖాన్‌ చౌదరి చేసిన ఆ ఫిర్యాదులో ఏముంది అంటే.. అనంతపురం రూరల్ మండలంలోని కొడిమి జగనన్న లేఅవుట్ కాలనీ కాంట్రాక్ట్‌ను పశ్చిమ బెంగాల్ వ్యక్తి సర్వర్‌ జహాన్‌కు ఇచ్చారు.  ఆ పనులను సొంత రాష్ట్రం నుంచి కూలీలను తెప్పించి పనులు పూర్తి చేస్తున్నారు.
Raptadu MLA controversy: వైసీపీ ఎమ్మెల్యేపై బెంగాల్‌ ఎంపీ ఫిర్యాదు- రాష్ట్రవాసులను బంధించారని కలెక్టర్‌కు మెయిల్- సంబంధం లేదన్న తోపుదుర్తి

ఇంతలో కాంట్రాక్టర్‌కు బెదిరింపులు రావడం స్టార్ట్ అయ్యాయి. కాలనీ నిర్మిస్తున్నందుకు తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్స్ ఎక్కువ అయ్యాయి. వాటిని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. చివరకు ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి బెదిరింపులు తీవ్రం చేశారు. నేరుగా కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. 

అంతే కాకుండా డబ్బులు ఇవ్వలేదని స్థానిక పోలీసులకు చెప్పి కాంట్రాక్టర్‌ను అక్కడ పని చేసే కూలీలను అరెస్టు చేయించారు. అప్పటి నుంచి వాళ్ల సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. బంధువులకు కూడా ఏ విషయం చెప్పడం లేదని వారంతా కంగారు పడుతున్నారు. ఇలా తీవ్ర ఆరోపణలతో ఎంపీ నుంచి జిల్లాయంత్రాంగం మెయిల్ అందుకుంది. 

విచారణ చేసి నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లాయంత్రాంగానికి ఎంపీ డిమాండ్ చేశారు. ఇందులో ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తున్నందున వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీక్రెట్‌గా విచారించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. మీడియాకు తెలియడంతో పోలీసులు మాత్రం మాట దాటవేస్తున్నారు. అలాంటి కిడ్నాప్‌లు ఏం జరగలేదని చెబుతున్నారు. 

అయితే తమను బెదిరించిన ఫోన్ కాల్‌ లిస్టును కూడా ఉన్నతాధికారులకు ఎంపీ పంపించినట్టు తెలుస్తోంది. అన్ని ఆధారాలు ఉన్నందున నేరుగా జిల్లా కలెక్టర్‌కు లెటర్ రాశారు.
Raptadu MLA controversy: వైసీపీ ఎమ్మెల్యేపై బెంగాల్‌ ఎంపీ ఫిర్యాదు- రాష్ట్రవాసులను బంధించారని కలెక్టర్‌కు మెయిల్- సంబంధం లేదన్న తోపుదుర్తి

ఎమ్మెల్యే తోపుదుర్తి కూడా తనకు బెదిరింపుల సంగతే తెలియదని అంటున్నారు. అది రెండు సంస్థల మధ్య వివాదమని వాళ్లే తేల్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా వారితో తనకేం పని అని ప్రశ్నిస్తున్నారు. సకాలంలో పని పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి ఉంటానని వివరిస్తున్నారు. 

ఈ ఆరోపణలపై ఘాటుగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. కొడిమి జగనన్న కాలనీలో త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని భావించామన్నారు. ఒక్కో ఇల్లు 1.80 లక్షల రూపాయలకు నిర్మించేలా లోటస్ ఎంటర్ ప్రైజేస్‌తో ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇళ్ల నిర్మాణ పనులపై నిర్లక్ష్యం చూపుతున్న కాంట్రాక్టు సంస్థను నిలదీశామని పేర్కొన్నారు. 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని కాంట్రాక్టు సంస్థ మోసం చేసిందని ఆరోపించారు. మోసగాళ్లకు పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. 

కార్మికులను తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి తీసుకురాలేదని ఉన్న పని వారిని కూడా తీసేశాడని ఆరోపించారు తోపుదుర్తి. వీటన్నింటికీ డబ్బులు తీసుకున్నాడని అంటున్నారు. జగనన్న కాలనీలు త్వరగా పూర్తి చేయాలన తపనతో ఉన్నామే తప్పే వేరే ఉద్దేశం లేదన్నారు.ఇందులో రామకృష్ణకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. తన వద్దే చందాలు వసూలు చేసారని ఆరోపించారు. సిగ్గులేని జన్మ అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆయన టీడీపీకి తోకపార్టీగా మారిందని విమర్శించారు. 

కాంట్రాక్టర్‌ సర్వర్ అనే వ్యక్తి ఆ ప్రాంత ఎంపీని కలసి తనపై ఫిర్యాదు చేయించాడని దీని వల్ల తనకు వచ్చిన నష్టం లేదన్నారు ప్రకాష్ రెడ్డి. రాప్తాడుకు టిడిపి అభ్యర్ధి లేడని అందుకే ఎవరెవరినో అడక్కుంటున్నారని విమర్శించారు. తాను సొంత డబ్బులతో రోడ్లు వేస్తున్నామన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను 2006 నుంచే కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నట్టు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget