అన్వేషించండి

చంద్రబాబుపై హత్యాయత్నం కేసు- అంగళ్లు ఘటనలో ఏ1గా చేర్చిన పోలీసులు

అన్నమయ్య జిల్లా ముదివేడులో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేసిన పోలీసులు ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమరనాథ్ రెడ్డి, ఏ4గా చల్లా బాబుపై కేసు నమోదు చేశారు.

పుంగనూరు, అంగళ్లు హింసాత్మక ఘటన కేసులు మరో మలుపు తిరగాయి. ఇందులో ఏ1 గా టీడీపీ అధినేత చంద్రబాబును చేరుస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆయనతోపాతు ఏ2గా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ3గా అమర్‌నాథ్ రెడ్డిని చేర్చారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్‍లో కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. 

ఈ నెల 4న చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పర్యటన సందర్భంగా ఘర్షణ జరిగింది.  అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద జరిగిన అల్లర్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లపై పోలీసులుకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబుతోపాటు టీడీపీ లీడర్లను నిందితుల జాబితాలో చేర్చారు.

అన్నమయ్య జిల్లా ముదివేడులో ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేసిన పోలీసులు ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమరనాథ్ రెడ్డి, ఏ4గా చల్లా బాబుపై కేసు నమోదు చేశారు. అయితే ప్రాజెక్టుల సందర్శన పేరుతో టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు ప్రసంగించారంటూ ఏఫ్ఐఆర్‌లో పోలీసులు నమోదు చేశారు.

మంగళవారం రాత్రి ముదివేడు పోలీసుల స్టేషన్‌లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, ఏ3గా అమర్‌నాథ్ రెడ్డి, పులివర్తి నానితో పాటుగా మరికొంత మంది టిడిపి‌ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. 

ఉమాపతిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్‌ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఉమాపతిరెడ్డి. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం, 120బీ సెక్షన్ కింద నేరపూరిత కుట్ర చేసినట్టు అందులో పేర్కొన్నారు. 

అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో మొత్తం 245 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఇందులో ఇప్పటి వరకూ 74 మందిపై పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ అల్లర్లకు టిడిపి నాయకులే కారణమంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపి నేతలైనా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, చల్లా బాబు(రామచంద్రారెడ్డి), పులివర్తి నానిపై కేసులు నమోదు చేశారు.

మొత్తం ఇప్పటి వరకూ ఏడు చార్జ్‌షీట్‌లు నమోదు చేయగా ఇందులో ప్రధాన నిందితుడిగా ఏ1 ముద్దాయిగా చల్లాబాబు అలియాస్ రామచంద్రారెడ్డిని చేర్చారు. మంగళవారం రోజు మరో రెండు కేసులు నమోదు చేశారు. చిత్తూరు సిసిఎస్ కానిస్టేబుల్ ఆర్ లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుంగనూరు టిడిపి ఇంచార్జ్ చల్లాబాబుతోపాటు చౌడేపల్లి, పులిచెర్ల మండలాలతోపాటు అన్నమయ్య జిల్లా, రాజంపేటకు చెందిన 47 మందిపై కేసులు నమోదు చేశారు.

అనంతపురానికి చెందిన మరో ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఫిర్యాదు మేరకు చల్లా బాబుతో పాటు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి నియోజవర్గానికి సంబంధించిన 39 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం కేసుల సంఖ్య 7కు చేరుకుంది. మొత్తం 7 కేసుల్లో ఏ 1గా పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పై ఎఫ్ఐఆర్ దాఖలైన క్రమంలో మొత్తం 7 కేసుల్లో 246 మంది టీడీపీ శ్రేణులపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 74 మందిని అరెస్ట్ చేసి, అందులో 61 మందిని కడప సెంట్రల్ జైలుకు తరలించగా, మిగిలిన వారిని చిత్తూరు సబ్ జైలులో ఉంచారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Embed widget