Palamaneru MLA: ప్రధాని మోదీ పర్యటనలో పలమనేరు ఎమ్మెల్యేకి చేదు అనుభవం, వెంకట్ గౌడ్ ను అడ్డుకున్న అధికారులు!

Palamaneru MLA Venkat Goud : తిరుపతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన (PM Modi Tirupati Tour)లో రేణిగుంట ఎయిర్ పోర్ట్ వద్ద పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ కి చేదు అనుభవం ఎదురైంది. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ప్రోటోకాల్ లిస్టులో వెంకట్ గౌడ్ పేరు లేకపోవడంతో అధికారులు ఆయనను బయట నిలిపివేశారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రావడంతో తన పేరు లిస్టులో లేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డితో పాటుగా బియ్యపు మధుసూదన్ రెడ్డితో లోపలికి వెళుతుండగా మరోసారి ఎయిర్ పోర్ట్ అధికారులు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ని ఆపేశారు. ఆ తరువాత ఏం జరిగిందో గానీ, ఎట్టకేలకు ఎయిర్పోర్ట్ లోపలి నుంచి ఎయిర్ పోర్ట్ ఓ అధికారి రావడంతో పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ లోపలికి వెళ్లారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)




















